సోషల్ మీడియా: నిన్న మఫ్లర్‌లో కేజ్రీవాల్.... నేడు ధోని హల్ చల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభంజనం సృష్టించారు. సామాన్యుడిగా బరిలోకి దిగిన ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, కాంగ్రెస్ పార్టీని దేశ రాజధాని ఢిల్లీలో మట్టికరిపించారు.

కేజ్రీవాల్ ఆహార్యంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మప్లర్, ఆయన విజయానికి కారణమని కొందరు క్రీడాభిమానులు కొత్త భాష్యం సోషల్ మీడియాలో చెబుతున్నారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా మళ్లీ రికార్డులను తిరిగరాయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Social media BUZZ: Now, Dhoni in muffler!

అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ధోని కూడా మఫ్లర్ కట్టుకుంటే, ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మళ్లీ టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇందులో భాగంగా హెల్మెట్ స్ధానంలో మఫ్లర్‌ను చుట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ధోని ఫోటోను మార్ఫింగ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లాగా ధోని కూడా మఫ్లర్ చుట్టుకుంటే వరల్డ్ కప్ మనదేనంటూ

దానికి వ్యాఖ్యలు జోడించి సోషల్ మీడియాలో పెట్టేసారు. ధోని ఫోటోతో కూడిన ఈ ఫోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+