ఇన్ స్టా డౌన్: కారణం ఇదే, నెటిజన్ల వెరైటీ పోస్టులు

సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగింది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. కొందరు యూజర్లకు ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ కాలేదు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు. సమస్య దేశంలో ఉదయం నుంచి ఉంది. దీంతో పలువురు సమస్యను మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో లేవనెత్తారు.

పోస్టులు లోడ్ అవడం లేదని, కొత్త పోస్టులు చేసేందుకు వీలు కావడం లేదని వారు తెలిపారు. ఇదే అంశంపై కొందరు ఫన్నీ పోస్టులను షేర్ చేశారు. యాప్ ఓపెన్ చేసి.. స్టోరీస్‌, పోస్టులు చూడ‌టానికి ప్ర‌య‌త్నిస్తే.. పోస్టులు, స్టోరీస్ రీలోడ్ కాలేవు. దీనికి సంబంధించి కొంద‌రు యూజ‌ర్ల‌కు అలెర్ట్ మెసేజ్ కూడా క‌నిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సర్వర్లు డౌన్ అవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.

social media platform instagram down

డౌన్‌టైమ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్ట‌ర్ వెబ్ సైట్ యూజర్ల సమస్యలను వెల్లడించింది. 47 శాతం మందికి యాప్ సరిగా ఓపెన్ కావడం లేదని వివరించింది. మరో 27 శాతం మంది వెబ్ వెబ్ వ‌ర్ష‌న్‌లో స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. 26 శాతం మందికి.. స‌ర్వ‌ర్ క‌నెక్ష‌న్ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్టు డౌన్‌డిటెక్ట‌ర్ వెల్ల‌డించింది. ఏదీ ఏమైనా.. ఇన్ స్టా ఓపెన్ కాకపోవడంతో.. జనం మాత్రం హైరానా పడిపోతున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాను నెటిజన్లు ఎక్కువగా వాడుతున్నారు. పోస్టులు చూడటం.. వీడియోలు చూసి.. షేర్ చేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో సర్వర్ డౌన్ వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. ఇదేం సమస్యరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. సమస్యను గుర్తించామని.. వీలయినంత త్వరగా సాల్వ్ చేస్తామని సైట్ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+