సెక్స్ సైట్లలో ఫోటోలు! : ప్రియురాలికి ఓ టెకీ బెదిరింపులు
చెన్నై : ప్రియురాలి ఫోటోలను నీలిచిత్రాల సైట్ లో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతితో ప్రేమాయణం నడిపిన అతగాడు.. లేనిపోని అనుమానాలు తలకెక్కించుకుని ఆమెపై బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెలకు ఐదంకెల జీతం అందుకునే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజులకే పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి బయటకెళ్లడాలు.. చాటింగ్ లు, మీటింగ్ లు కొనసాగుతూ వస్తున్నాయి. ఇక్కడిదాకా అంతా సాఫీగానే ఉన్నా.. ప్రియురాలు తనను దూరం పెడుతుందన్న అనుమానం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లో మొదలవడంతో.. ప్రియురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కక తప్పలేదు.

ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. బ్లూఫిల్మ్స్ కు సంబంధించిన సైట్స్ లో ఆమె ఫోటోలు అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. తన ఫ్రెండ్స్ కు షేర్ చేసి పరువు తీస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులను ఆశ్రయించి అతగాడిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. కాగా, నిందితుడి పేరు మెర్సిల్ అని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి చీటర్స్ పట్ల కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని సూచించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications