పోలీసులకు ఫిర్యాదు చేశాడని టెక్కీ దారుణ హత్య
చెన్నై: పోలీసులకు ఫిర్యాదు చేసి, అరెస్టు చేయించాడన్న కోపంతో సాఫ్టువేర్ ఇంజినీర్‌ను హత్య చేసి పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరునల్వేలి జిల్లా కరివందనల్లూర్ సమీపంలో సెందట్టియార్ సౌత్ వీధికి చెందిన కామాక్షి తనయుడు అనంద్ చెన్నైలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతని భార్య రాధిక. వీరికి ఆరు నెలల పసిబిడ్డ ఉంది. చెన్నై నుంచి ఆనంద్ భార్య, బిడ్డను చూడటానికి సొంత ఊరికి వచ్చారు. మంగళవారం ఉదయం గరిసెల కులం సెందట్టియాపూరం రోడ్డు పైన ఆనందకుమార్ మృతదేహం పడి ఉంది.
సమాచారం అందుకున్న గరివలం, వందనల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తగాదాల కారణంగానే హత్య జరిగిందని తేలింది.

ఆనంద్ కుమార్ తండ్రికి, అతని తమ్ముడు ముత్తువాళీ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం ముత్తువాళి తనయుడు సెల్వరాజ్.. ఆనంద్ కుమార్ పైన దాడి చేశాడు.
శివగిరి పోలీసులు సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. అతడు ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో హత్య ఆనంద్ కుమార్‌ను హత్య చేశాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications