భార్య నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన టెక్కీ
బెంగుళూరు: కట్నం కోసం కట్టుకున్న భార్య నగ్నచిత్రాలను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడో ప్రబుద్ధుడు. అంతేకాదు అంతటితో ఆగిందా? అతని క్రూరత్వం తన భార్యతో కలిసి తాను శృంగారం చేసిన చిత్రాలతో కూడిన సీడీని ఏకంగా ఆమె తండ్రికి పంపించాడు.
ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కాసరగోడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట అతనికి చేర్తళ(కేరళ)కు చెందిన 20 ఏళ్ల యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ గతేడాది గురువాయూర్ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే అతడిలో ఉన్న మానవమృగాన్ని ఆమెపై చూపించేవాడు. పుట్టింటినుంచి కట్నం తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.
భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో క్రూరంగా మారిపోయిన భర్త గతంలో తన భార్యకు తెలియకుండా తీసిన ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోల సీడీని ఆ యువతి తండ్రికి పంపాడు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాసరగోడు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications