బర్త్ డే పార్టీకి పిలిస్తే భార్య స్నేహితుడి మీద కన్నేసిన టెక్కీ, రూంలో ఒంటరిగా చిక్కిందని !

బెంగళూరు: ఒంటరిగా గదిలో ఉన్న స్నేహితుడి భార్య మీద సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. బాధితురాలు తప్పించుకుని పారిపోయి జరిగిన విషయం భర్తకు చెప్పడంతో అతను బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్నేహితుడని బర్త్ డే పార్టీకి పిలిచిన పాపానికి తన భార్య మీద అత్యాచారం చెయ్యడానికి టెక్కీ ప్రయత్నించాడని బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 పార్టీకి పిలిచిన దంపతులు

పార్టీకి పిలిచిన దంపతులు

బెంగళూరు నగరంలోని బెళ్లందూరు సమీపంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతంలో నీలబ్ నయన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు నివాసం ఉంటున్నాడు. కుసమనహళ్ళిలోని స్పోర్ట్స్ క్లబ్ లో నవ దంపతులు బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులు అందర్నీ ఆహ్వానించారు.

 కామాంధుడు వెళ్లాడు

కామాంధుడు వెళ్లాడు

స్నేహితులు ఆహ్వానం మేరకు సాఫ్ట్ వేర్ ఇంజనీరు నీలబ్ నయన్ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. స్నేహితులతో కలిసి రాత్రి నీలబ్ నయన్ పీకలదాక మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న నీలబ్ నయన్ అక్కడున్న అమ్మాయిలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

3. ఎందుకు

రూంలో ఫ్రెండ్ భార్య !

రూంలో ఫ్రెండ్ భార్య !

బర్త్ డే పార్టీలో అసభ్యంగా ప్రవర్తించిన నీలబ్ నయన్ తరువాత ఆదే కాంప్లెక్స్ లోని బాత్ రూం దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో బాత్ రూం పక్కనే ఉన్న విశ్రాంతి గదిలో స్నేహితుడి భార్య నిద్రపోతున్న విషయం సాఫ్ట్ వేర్ ఇంజనీరు నీలబ్ నయన్ గుర్తించాడు.

 అరిస్తే చంపేస్తానని బెదిరించి !

అరిస్తే చంపేస్తానని బెదిరించి !

విశ్రాంతి గదిలో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్య మీద నీలబ్ నయన్ అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. అరిస్తే చంపేస్తానని స్నేహితుడి భార్య మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఆ సమయంలో గట్టిగా కేకలు వేసిన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి జరిగిన విషయం భర్తకు చెప్పింది. పీకలదాక మద్యం సేవించిన నీలబ్ నయన్ స్నేహితుడి భార్య మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెళ్లందూరు పోలీసులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+