వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి హైదరాబాద్ లేడీ టెక్కీ ఒత్తిడి: టెక్కీ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Suicide
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మగ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై తీవ్రమైన ఒత్తిడి పెట్టిన సంఘటన విషాదానికి దారి తీసింది. యువతి వేధింపులకు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలోని యెరవాడలో చోటు చేసుకుంది.

లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ది హైదరాబాద్‌గా తేలింది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి.

వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాద్‌లోని ఓ సాఫ్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువతి గతంలో పూణేలో చదివింది. ఆ సమయంలో ఆమెకు పూణేలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన రోహిత్ కపూర్ కుమారుడు సిద్ధాంత్ రోహిత్ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. అతను పూణేలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసేవాడు.

కాలేజీలో ఏర్పడిన పరిచయంతో యువతీయువకులు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకన్నారు. ఇటీవల ఆ యువతి సిద్ధాంత్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రతిసారీ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, మోసం చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ యువతి అతన్ని వేధించడం ప్రారంభించింది.

యువతి ఒత్తిడితో విసిగిపోయిన సిద్ధాంత్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యుఎస్‌బి కార్డుతో తన గది పైభాగంలో ఉన్న కప్‌బోర్డుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

English summary
A software engineer in Pune has commited suicide with a lady techie of Hyderabad has put pressure on him to marry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X