ఆడియో టేపుల కుట్రలో సంజయ్ జైన్ అరెస్ట్: సీఎంవో లోకేశ్ శర్మ పేరుతో బయటకు టేపులు: బీజేపీ
రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేపుతోన్నాయి. గెహ్లట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్‌తో కలిపి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మతో సంప్రదింపులు జరిపారని కాంగ్రెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపునకు ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి సంజయ్ జైన్‌ను ఎస్‌వోజీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 124 ఏ, 120 బీ కింద కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

బీజేపీ కాదు కాంగ్రెస్..
సంజయ్ జైన్ మరో పేరు సంజయ్ బర్దియా అని అధికారులు తెలిపారు. సంజయ్ జైన్ బీజేపీ నేత అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అతను కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ అని బీజేపీ తిప్పికొట్టింది. అంతకుముందే బేరసారాల కుట్రపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

నా వాయిస్ కాదు
కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి షెకావత్ ఖండించారు. ఆ వాయిస్ తనకి కాదు అని స్పష్టంచేశారు. సంజయ్ జైన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. ఆ పేరుతో చాలా మంది ఉంటారని తెలిపారు. అయితే తాను ఎవరితో మాట్లాడితే.. తన నంబర్ అక్కడ ఉండాలన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. అందుకు తాను సిద్ధమని మరోసారి స్పష్టంచేశారు.
Recommended Video

సీఎంవో లోకేశ్ శర్మ
ఆడియో టేపులతో గజేంద్ర షెకావత్‌కు సంబంధం లేదు అని బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టంచేశారు. సీఎంవోలో పనిచేస్తున్న లోకేశ్ శర్మ పేరుతో బయటకొచ్చాయని మరో నేత పునియా ఆరోపించారు. ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేస్తోందా అని ప్రశ్నించారు. అంతేకాదు తమ ఫోన్లను కూడా రికార్డు చేస్తున్నారని.. తర్వాత కుట్రలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications