ముగిసిన సూర్య గ్రహణ: ఆరంభం, ముగింపు అద్భుత దృశ్యాలు వీక్షించిన జనం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు మనదేశంలో సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగింది. చాలా చోట్ల పాక్షికంగానే సూర్య గ్రహణం కనిపించింది. ఈ గ్రహణ అద్భుత దృశ్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు టెలిస్కోప్‌లతో వీక్షించారు.

భారతదేశంలో సూర్య గ్రహణం పాక్షికంగానే కనిపించింది. మంగళవారం సాయంత్రం 4.29 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైంది సూర్య గ్రహణం. ఇక హైదరాబాద్ నగరంలో 4.59కి సూర్య గ్రహణం మొదలై ఆరున్నర గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియంలో సూర్యగ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో భారీగా వీక్షకులు తరలివచ్చారు.

solar eclipse: The last solar eclipse of 2022 Ends in India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4.49 గంటలకు, తిరుపతిలో 5.01 గంటలకు సూర్య గ్రహణం మొదలై సుమారు మరో గంటన్నర పాటు కొనసాగింది. కాగా, సూర్య గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనక దుర్గ ఆలయం, యాదాద్రి నరసింహ స్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం మూసివేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. జపాలు, గ్రహణ దోష నివారణ పూజలు చేస్తున్నారు. గ్రహణ అనంతరం చేయాల్సిన కార్యక్రమాలను చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+