Youtube: యూట్యూబ్ తో కోట్లు సంపాదిస్తున్నారు..
దేశంలో సోషల్ మీడియాతో డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ తో భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు. యూట్యాబ్ తో ఓ వ్యక్తి రూ.50 కోట్ల ఆస్తి కూడబెట్టాడు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ పదేళ్లకే గేమింగ్ వీడియోలతో యూట్యూబ్ ప్రారంభించాడు.
ఆ తర్వాత యూట్యూబ్ నే కేరీర్ గా ఎంచుకున్నాడు. ఒక వైపు యూట్యూబ్ తో డబ్బులు సంపాదిస్తూనే.. డిస్టెన్స్ లో చదువుకుంటున్నాడు.
అజయ్ క్యారీమినాటీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్ ఛానల్ కు నాలుగు కోట్లకు పైగా చందాదారులున్నారు.ప్రస్తుతం 25 ఏళ్ల వయస్సున్న అంజయ్ ఆస్తి విలువ అక్షరాల రూ. యాబై కోట్లు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా యూట్యూబ్ తో భారీగా సంపాందిస్తున్నారు. మై విలేజ్ యూట్యూజ్ ఛానల్ వారు కూడా భారీగా ఆర్జిస్తునట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడుకు చెందిన ఓ కుకింగ్ ఛానల్ వారు భారీగా సంపాదిస్తున్నారు.

విలేజ్ కుకింగ్ ఛానలకు 2 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఆశిష్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. చంచ్లానీ వైన్స్పేరుతో పెట్టిన యూట్యూబ్ ఛానల్ తో భారీగా ఆర్జించాడు. ప్రస్తుతం అతని ఆస్తి రూ.41 కోట్లుగా ఉంది. అమ్మన్ అహ్మద్ యూట్యాబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇతను యూట్యూబ్ ద్వారా మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నారు. యూపీకి చెందిన నిశామధఉలిక కూడా యూట్యూబ్ ఛానల్ తో కోట్లు సంపాదించారు.
ఆమె 64 ఏళ్ల వయసులో కోటిన్నర చందాదారులతోనూ రూ.43 కోట్ సంపాదించారు. ఈమె 2009లో కుకింగ్ ఛానల్ నడిపిస్తున్నారు. 32 ఏళ్ల గౌరవ్ చౌధురి కూడా యూట్యూబ్ తో భారీగా సంపాదిస్తున్నారు. గౌరవ్ ఇప్పటివరకు రూ.350 కోట్లకుపైనే సంపాదించారు.












Click it and Unblock the Notifications