అన్నా, కేజ్రీవాల్ ఫైట్: వికె సింగ్ వ్యాఖ్య, అన్నా ఫైర్
రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారేకు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. గత నాలుగు రోజులుగా తాను దీక్ష చేస్తున్న వేదిక నుంచి వెళ్లిపోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్‌ని హజారే ఆదేశించారు. హజారేకు సన్నిహితుడు, మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్‌తో రాయ్ వాగ్వివాదానికి దిగడంతో అన్నా ఆగ్రహించారు.
ఒకరు ప్రసంగిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడడం సరికాదని, గొడవ సృష్టించడానికి బదులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదని అన్నా హజారే రాయ్‌తో చెప్పారు. వికె సింగ్ ప్రసంగిస్తూ పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. హజారే కన్నా తాము పెద్దవాళ్లమని కొంత మంది అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వికె సింగ్‌కు ఆ తర్వాత రాయ్ సమాధానం ఇచ్చారు. నరేంద్ర మోడీతో చేతులు కలపడానికి వికె సింగ్ అన్నాను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్నా హజారే ర్యాలీ నుంచి వెనక్కి రావాలని ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాయ్‌ను ఆదేశించినట్లు సమాచారం. జన్ లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ అన్నా హాజరే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, మరో వివాదం కూడా ముందుకు వచ్చింది. అర్వింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషన్ ఆర్టికల్ రాశారనే విషయంపై వివాదం చెలరేగుతోంది. తాను అటువంటి ఆర్టికల్ ఏదీ రాయలేదని, మెయిల్ టుడేపై దావా వేస్తానని శాంతిభూషణ్ అన్నారు. ఆ విషయాన్ని తాను పరిశీలిస్తున్నట్లు మెయిల్ టుడే సంపాదకుడు సందీప్ బంజాయ్ జాతీయ మీడియా సంప్రదిస్తే చెప్పారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications