కూతురి విషయంలో తేడా, తండ్రిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేసిన కొడుకు, మ్యాటర్ !

చెన్నై: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. భర్తకు సిటీలో కోట్ల రూపాయల విలువ చేసే భవనం ఉంది, భార్య, కూతురు, కుమారుడితో కలిసి అతను హ్యాపీగా ఉంటున్నాడు. అయితే ఇదే సమయంలో ఫ్యామిలీలో ఆ విషయంలో రచ్చ మొదలైయ్యింది. రానురాను గొడవలు ఎక్కువ అయ్యాయి. క్రికెట్ బ్యాట్ తీసుకుని కన్న తండ్రిని అతని కొడుకు దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

తమిళనాడులోని గిండి ఎకతుతంగల్‌లోని షణ్ముఖ రాజా ప్రాంతంతో బాలసుబ్రమణి (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు సుమారు 30 ఏళ్ల క్రితం సుబ్బులక్ష్మి (48) అనే మహిళను బాలసుబ్రమణి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు ఇద్దరూ చాలా సంతోషంగా జీవించారు. కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి కావడంతో బాలసుబ్రమణి, సుబ్బలక్ష్మి దంపతుల ఇంటికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లారు.

death
బాలసుబ్రమణి, సుబ్బలక్ష్మి దంపతులకు సుమిత్ర (28) అనే కుమార్తె, జగదీష్ (23) అనే కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మి, కూతురు, కుమారుడితో బాలసుబ్రమణి చాలా సంతోషంగా జీవించాడు. అయితే రానురాను బాలసుబ్రమణి ఇంటిలో గొడవలు మొదలైనాయి. ఆ గొడవలు ఎక్కువ కావడంతో బాలసుబ్రమణి కుటుంబంలో ప్రతిరోజు పంచాయితీలు మొదలైనాయి.

తరువాత బాలసుబ్రమణి ఇంటిలో ఆస్తి తగాదాల మొదలైనాయి. ఆస్తి తగాదాల కారణంగా బాలసుబ్రమణి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలసుబ్రమణిని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో మద్యానికి బానిసైన బాల సుబ్రమణి ప్రతి రోజూ పీకలదాక మద్యం తాగడం అలవాటు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలవాటు చేసుకున్నాడు.

death

అలాగే గత ఏడాది కాలంగా కుటుంబంతో విడిపోయిన బాలసుబ్రమణి అతని ఇంటి దిగువ కారిడార్‌లో నివాసం ఉంటున్నాడు. బాలసుబ్రమణి కుమార్తె సుమిత్రకు ఆరోగ్య సమస్యలు రావడంతో తమ్ముడు జగదీష్‌ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పూర్తి అయిన తరువాత ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న బాలసుబ్రమణి కుమారుడు జగదీష్‌ను దూషించాడే.

తరువాత సొంత కుమార్తె సుమిత్రపై దుర్భాషలాడి ఆమెను చాలా నీచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన జగదీష్ తన తండ్రి బాలసుబ్రమణితో వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం ముదిరిపోవడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన జగదీష్ క్రికెట్ బ్యాట్ తీసుకుని అతని తండ్రి బాలసుబ్రమణి తల మీద దాడి చేశాడు. నేలపై పడి ఉన్న తండ్రి తల మీద ఇటుకలతో కొట్టాడు. బాలసుబ్రమణి అక్కడికక్కడే మృతి చెందాడు. కన్న తండ్రిని అతని కొడుకు క్రికెట్ బ్యాట్ తో, ఇటుకలతో కొట్టి హత్య చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+