Viral Video: విమానం నడిపేది మా కొడకేనా.. ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్..
పిల్లలు అంటే తల్లిదండ్రలకు చాలా ప్రేమ ఉంటుంది. వారు పిల్లల భవిష్యత్త్ కోసం అహర్నిశలు కృషి చేస్తారు. తాము తిన్నా తినకున్నా పిల్లలకు మాత్రం పెడతారు. వారు విజయం సాధిస్తే సంతోష పడతారు. పిల్లలు ఓడిపోతే భుజం తడతారు. పిల్లలు ఎన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగినా దానికి తల్లిదండ్రులు పడిన శ్రమ మెట్లుగా ఉంటాయి. అలాంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం పిల్లల బాధ్యత. వారిని మలి వయస్సులో ఆనందంగా ఉంచడం పిల్లల కార్తవ్యం.
ఇలానే ఓ బిడ్డ తన తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. వైలట్ అయిన అతను, తల్లిదండ్రులకు గొప్ప అనుభూతిని కలిగించాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దంపతులు ఫ్లైట్ ఎక్కారు. అయితే విమానం నడపబోయేది వారి కొడకని వారికి తెలియదు. కొడకు కమల్ కుమార్ ను కాక్‌పిట్ ప్రవేశద్వారం వద్ద చూశారు.

వెంటనే కొడకు దగ్గరి వెళ్లిన తల్లి ఆనందంతో మురిసిపోయింది. కొడుకు చేయి పట్టుకుని నవ్వింది. ఈ వీడియోలో కమల్ కాక్‌పిట్‌లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్న చిత్రాలు కూడా ఉన్నాయి.ఇందుకు సంబంధంచిన వీడియో కమల్ కుమార్ అనే పైలట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
"నేను ఎగరడం ప్రారంభించినప్పటి నుండి నేను దీని కోసం ఎదురు చూస్తున్నాను, చివరకు జైపూర్‌కి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం నాకు లభించింది. ఇది చాలా అనుభూతి" అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు కమల్ కుమార్.












Click it and Unblock the Notifications