Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం !

కొచ్చి/ చెన్నై/ బెంగళూరు: సినిమాలో ఎడిటింగ్ చేసిన రేప్ సీన్లు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. సినిమా విడుదలైన సమయంలో ఆ సినిమాలో లేని సీన్ లు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలయాళం సినిమాలో నటించిన నటిని ఇప్పుడు అందరూ పిలిచి పిలిచి బూతులు తిట్టడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో ఫర్ సేల్ సినిమా రేప్ సీన్లు దర్శనం ఇవ్వడంతో ఆ నటి అవమానంతో ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. తనకు న్యాయం చెయ్యాలని ఆ నటి సీఎం, డీజీపీ, సైబర్ క్రైమ్ పోలీసులను వేడుకుంటూ లేఖ రాసింది. 150 మంది మద్యలో రేప్ సీన్ లో నటించలేనని ఆరోజు చెప్పానని, ఈ రోజు ఆ సీన్లు ప్రపంచం మొత్తం చూసి నా మీద దుమ్మెత్తి పోస్తున్నారని మలయాళం నటి బోరన విలపిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

 సోనా ఆత్మహత్యాయత్నం

సోనా ఆత్మహత్యాయత్నం

ప్రముఖ మలయాళం నటి సోనా అబ్రహాం పలు మలయాళం సినిమాల్లో నటించింది. నటి సోనా అబ్రహాం కొచ్చిలో ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో కేరళలో కలకలం రేపింది. నటి సోనా అబ్రహాంకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. కొన్ని మసాలా సినిమాల్లో సోనా అబ్రహాం నటించింది. సోనా అబ్రహాం ఆత్మాహత్నాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స చేసుకుని కొలుకుంది. ఈ సందర్బంగా మలయాళం నటి సోనా అబ్రహాం బోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకుని ఓ వీడియో విడుదల చెయ్యడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

 2013లో ఫర్ సేల్ మసాలా సినిమా

2013లో ఫర్ సేల్ మసాలా సినిమా

సోనా అబ్రహాం పలు మలయాళం సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తాను 2013లో ఫర్ సేల్ అనే సినిమాలో నటించానని సోనా అబ్రహాం గుర్తు చేసింది. ఫర్ సేల్ సినిమాలో తనతో పాటు రొమాంటిక్ సంధ్య (మలయాళం సెక్స్ బాంబ్), ఐశ్వర్యతో పాటు అనేక మంది నటించారని నటి సోనా అబ్రహాం గుర్తు చేశారు. ఫర్ సేల్ సినిమాలో రొమాంటిక్ సంధ్యకు చెల్లిగా తాను నటించానని నటి సోనా అబ్రహాం గుర్తు చేసింది.

 150 మందిలో రేప్ సీన్ షూటింగ్

150 మందిలో రేప్ సీన్ షూటింగ్

2013లో తనకు 14 ఏళ్ల వయసు, ఆ సమయంలో తాను స్కూల్ కు వెలుతున్నానటి సోనా అబ్రహాం అన్నారు. ఫర్ సేల్ సినిమాలో తన మీద అత్యాచారం జరుగుతుందని, తరువాత ఆవేదనతో తన అక్కగా నటించిన సంధ్య ఆత్మహత్య చేసుకుంటుందని, కథ పరంగా అలాంటి సీన్ లు ఉన్నాయని నటి సోనా అబ్రహాం గుర్తు చేశారు. అయితే ఫర్ సేల్ సినిమా షూటింగ్ లో సుమారు 150 మందికి పైగా టెక్నీషియన్లు పాల్గొంటున్నారని, ఆ సమయంలో అందరి మద్య తాను రేప్ సీన్ లో నటించనని దర్శకుడు సతీష్ కు తాను తేల్చి చెప్పానని నటి సోనా అబ్రహాం గుర్తు చేశారు.

 డైరెక్టర్ ఆఫీస్ లో మసాలా సీన్స్

డైరెక్టర్ ఆఫీస్ లో మసాలా సీన్స్

ఫర్ సేల్ సినిమాకు సతీష్ దర్శకుడు అని సోనా అబ్రహాం అన్నారు. తాను అందరి ముందు రేప్ సీన్ లో నటించనని, తన వయసు 14 ఏళ్లు మాత్రమే ఉందని, తాను చదువుకుంటున్నానని ఆ సందర్బంలో వేడుకున్నానని సోనా అబ్రహాం చెప్పారు. కొచ్చిలోని అనంతపురి ప్రాంతంలోని దర్శకుడు సతీష్ కార్యాలయంలో తన మీద లైంగిక వేధింపుల సీన్ లు (రేప్ సీన్లు) చిత్రీకరించారని, అక్కడ షూటింగ్ పూర్తి అయిన తరువాత తాను ఇంటికి వెళ్లిపోయానని సోనా అబ్రహాం గుర్తు చేశారు.

 పోర్న్ సైట్లు, సోషల్ మీడియాలో ఫర్ సేల్ రేప్ సీన్స్

పోర్న్ సైట్లు, సోషల్ మీడియాలో ఫర్ సేల్ రేప్ సీన్స్

మలయాళంలో విడుదలైన ఫర్ సేల్ సినిమాలో తన మీద చిత్రీకరించిన రేప్ సీన్లు, లైంగిక వేధింపుల సీన్లు చాలా వరకు లేవని సోనా అబ్రహాం చెప్పారు. అయితే సినిమాలో లేని రేప్ సీన్ లు తాను ఇంటర్ (PUC) చదువుతున్న సమయంలో సోషల్ మీడియాలో, అనేక పోర్న్ సైట్లలో లీక్ అయ్యాయని సోనా అబ్రహాం ఆవేదన వ్యక్తం చేసింది. తన మీద చిత్రీకరించిన రేప్ సీన్ లు సినిమాలో లేవని, ఆ సీన్ లు దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ దగ్గర మాత్రమే ఉన్నాయని, కనీసం తన దగ్గర కూడా ఆ సన్నివేశాలు లేవని సోనా అబ్రహాం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఫర్ సేల్ సినిమా ఎందుకు తీశారో ? దర్శకుడు సతీష్ ఈ సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇచ్చాడో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని, తెలిసీ తెలీని వయసులో ఆ సినిమాలో నటించి తాను పెద్ద తప్పు చేశానని నటి సోనా అబ్రహాం విచారం వ్యక్తం చేసింది.

 ఎవరు నువ్వు ?..... మాకేం తెలుసు .. ఛీ పో !

ఎవరు నువ్వు ?..... మాకేం తెలుసు .. ఛీ పో !

ఎడిటింగ్ లో ఎగిరిపోయిన సన్నివేశాలు సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో ఎలా లీక్ అయ్యాయని తాను దర్శకుడు సతీష్ తో పాటు ఫర్ సేల్ సినిమా నిర్మాత, ఎడిటర్ ను ప్రశ్నించానని, ఎవరు నువ్వు ?, ఆ సీన్లు ఎలా లీక్ అయ్యాయో మాకేం తెలుసు ? అంటూ తన మీద ఎదురుదాడికి దిగుతున్నారని నటి సోనా అబ్రహాం బోరున విలపించింది. తన అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో డిలీట్ చేసి, ఆ సీన్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చెయ్యాలని కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్, డీజీపీ, సైబర్ క్రైమ్ పోలీసులకు మనవి చేస్తూ ఇప్పటికే తాను లేఖలు రాశానని నటి సోనా అబ్రహాం విలపించింది.

పిలిచి బూతులు తిడుతున్నారు

తన మీద చిత్రీకరించిన రేప్ సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత తనను అందరూ అనుమానంతో, అసహ్యంగా చూస్తున్నారని, కొందరు దగ్గరకు పిలిచి మరీ అమ్మనా బూతులు తిడుతూ మండిపడుతున్నారని, ఈ వ్యవహారంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందని సోనా అబ్రహాం ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 14 ఏళ్ల వయసు ఉన్న సమయంలో తెలిసో తెలీకో అలాంటి సినిమాల్లో నటించానని, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను మసాలా సినిమాల్లో నటించడం లేదని సోనా అబ్రహాం బోరన విలపిస్తోంది. తనకు కేరళ ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారని నటి సోనా అబ్రహాం చెబుతోంది. మొత్తం మీద 2013లో చిత్రీకరించిన ఫర్ సేల్ సినిమా రేప్ సీన్ క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆవేదనతో నటి సోనా అబ్రహాం ఇప్పటికే అనేక సార్లు ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+