పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన టిక్‌టాక్ స్టార్ సొనాలీ.. సొంత చెల్లెలిపై ఫిర్యాదు..!

చండీఘర్ : టిక్‌టాక్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సొనాలీ ఫోగట్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సొంత సోదరితో పాటు ఆమె భర్తపై ఫిర్యాదు చేశారు. వారిద్దరూ కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. సొంత చెల్లెలైన రుకేశ్ ఫోగట్‌తో పాటు ఆమె భర్త అమిన్ ఈ నెల 28వ తేదీన భూంతాన్ కలాన్ గ్రామంలోని తన ఇంటికొచ్చి అసభ్య పదజాలంతో ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా దాడి కూడా చేశారని ఆరోపించారు. సొనాలీ ఫోగట్ ఫిర్యాదు మేరకు రుకేశ్ ఫోగట్, అమిన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోనాలీ ఫోగట్‌ ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అదంపూర్‌ స్థానం నుంచి ఆమె బరిలో నిలిచి ఓటమి చెందారు. టిక్‌టాక్ సెలబ్రిటీగా ముద్రపడ్డ సొనాలీ ఫోగట్‌కు పిలిచి టికెట్ ఇచ్చారు బీజేపీ నేతలు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ బిష్ణోయ్ చేతిలో 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Sonali Phogat Tik Tok star files complaint against sister

గత 50 ఏళ్ల నుంచి అక్కడ బిష్ణోయ్ ఫ్యామిలీ ఆధిపత్యం నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాళ్లే విజయం సాధిస్తున్నారు. అయితే హర్యానాలో బీజేపీ గెలుస్తుందని భావించిన సొనాలీ తన గెలుపు కూడా ఖాయమని భావించారు. కానీ కుదరలేదు, చివరకు ఓటమి పాలయ్యారు. సొనాలీ ఫోగట్‌కు 34 వేల ఓట్లు వచ్చాయి. బిష్ణోయ్‌కు 64 వేల ఓట్లు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+