'సోనమ్ గుప్తా బేవఫా హై': నువ్వెక్కడున్నా రావాలి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు అనంతరం.. నోట్ల పైన ఓ పేరు ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పేరే సోనమ్ గుప్తా. సోనమ్ గుప్తా బేవఫా హై అని రాసి ఓ కరెన్సీ నోటు పైన కనిపించింది. అప్పటి నుంచి అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సోనమ్ బేవఫా
సోనమ్ గుప్తా బేవఫా హై అని పది రూపాయల నోటు పైన రాసి ఉంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం ఆ నోటు వెలుగు చూసింది. సాధారణంగా నోటు పైన అంకెలు రాస్తుంటారు. కానీ ఇక్కడ సోనమ్ గుప్తా అని పేరు రాసి ఉంది.

ఎవరీ సోనమ్ గుప్తా
అసలు ఈ సోనమ్ గుప్తా ఎవరు, అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఉన్నా ఎక్కడుందా తెలియదు. కానీ రూ.పది నోటు పైన పేరు కనిపించడంతో అది ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తోంది. తొలుత పది రూపాయల నోటు పైన కనిపించిన ఆ పేరు ఇప్పుడు కొత్తగా వచ్చిన రూ.2000, రూ.500 నోట్ల పైన కూడా కనిపించింది.

ట్రెండింగ్
దీంతో అది నెట్లో ట్రెండింగ్ అయింది. కొందరు నెటిజన్లు ఈ నోటును ఆధారంగా చేసుకొని సోనమ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బేవఫా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సోనమ్ నువ్వెక్కడున్నా రావాలని అంటున్నారు.

కామెంట్లు
సోషల్ మీడియాలో కొందరు నాయకుల ఫోటోలు పెట్టి కూడా సరదా కామెంట్లు చేస్తున్నారు. సోనమ్ గుప్తా నాదే అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications