అస్పత్రిలో చేరిన సోనమ్ కపూర్: స్వైన్ ఫ్లూగా అనుమానం
అహ్మదాబాద్: బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఆస్పత్రిలో చేరారు. ఆమె రాజ్‌కోట్‌లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఆమెను రాజ్‌కోట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లినప్పుడు తాను గొంతు నొప్పితో, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇవి స్వైన్ ఫ్లూ లక్షణాలు.
గుజరాత్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 256 మంది ఈ వ్యాధికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం సోనమ్ కపూర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. స్వైన్ ఫ్లూ పరీక్షల నిమిత్తం వైద్యులు రక్తం నమూనాలను తీసుకున్నారు.

సూరత్ బర్జాత్యా సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా షూటింగ్ నిమిత్తం ఆ భామామణి గుజరాత్ వచ్చారు. గోండల్ పట్టణంలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. రాజ్‍కోట్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం స్వాతంత్ర్యానికి పూర్వం రాచరిక పాలనలో ఉంది. ఇక్కడ గతంలో హమ్ దిల్ దే చుకే సినిమా షూటింగ్ కూడా జరిగింది.
ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ కూడా గోండల్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మార్చి రెండో వారంలో ముగుస్తుందని భావిస్తున్నారు.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications