టిపై వెంకయ్యను కోరిన సోనియా, రేపు మాట్లాడే ఛాన్స్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు మద్దతివ్వాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడును కోరారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో సోనియా, వెంకయ్యలు తారసపడ్డారు.

ఈ సందర్భంగా సోనియా బిల్లుకు మద్దతివ్వాలని వెంకయ్యను కోరారు. దానికి వెంకయ్య నాయుడు సమాధానంగా... తమ పార్టీ ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే తాము తప్పకుండా మద్దతిస్తామని తెలిపారు.

Sonia appeals Venkaiah to support T Bill

మరోవైపు బిజెపి సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్‌లు భేటీ అయ్యారు. బిల్లుకు సంబంధించి బిజెపి ప్రతిపాదనల పైన చర్చించారు.

బిల్లుపై రేపు సోనియా మాట్లాడుతారా?

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సోనియా గాంధీ రేపు మాట్లాడే అవకాశముంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పారు. లోకసభలో బిల్లుపై కచ్చితంగా చర్చ జరుగుతుందని, బిల్లుపై సోనియా మాట్లాడే అవకాశముందన్నారు.

యాభయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లడమే: కావూరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడమేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఢిల్లీలో వేరుగా అన్నారు. బిల్లును ఆపేందుకు తాము కృషి చేస్తామన్నారు. అధిష్టానం నిర్ణయంపై ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+