సోనియా ప్రసంగిస్తుండగా.. నమాజ్ పిలుపు.. వెంటనే ఏంచేశారంటే?
సోనియా ప్రసంగం కొనసాగుతున్న సమయంలో.. దూరం నుంచి ఆవాజ్(నమాజ్ పిలుపు) వినిపించింది. దీంతో వెంటనే తన చీర కొంగును తల మీదుగా కప్పుకున్నారు సోనియా.
అలహాబాద్ : దేశంలో తన ప్రాబల్యాన్ని ఇప్పటికే చాలావరకు కోల్పోయిన కాంగ్రెస్.. వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే 26ఏళ్లుగా యూపీలో అధికారానికి నోచుకోలేదు కాంగ్రెస్. ఈ దఫా అయినా ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఛాయా చిత్ర ప్రదర్శన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సోనియా. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సోనియా ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

సోనియా ప్రసంగం కొనసాగుతున్న సమయంలో.. దూరం నుంచి ఆవాజ్(నమాజ్ పిలుపు) వినిపించింది. దీంతో వెంటనే తన చీర కొంగును తల మీదుగా కప్పుకున్నారు సోనియా. ఆ తర్వాత ప్రసంగం కొనసాగించారు. అయితే నమాజ్ పిలుపు విని సోనియా అలా స్పందించి ఉంటారా.. లేక కాకతాళీయంగానే జరిగి ఉంటుందా అనేదానిపై స్పష్టత లేదు. ఏదేమైనా ఈ పరిణామం అక్కడున్న ముస్లింలను ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూపీలో 30శాతం ముస్లిం జనాభా ఉండగా.. రాబోయే ఎన్నికల్లో వీరి ఓటు బ్యాంకు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications