సోనియా గాంధీకి అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
గురువారమే సోనియాను ఆస్పత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కాగా, సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా జనవరిలోనూ ఆమె ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications