సోనియా గాంధీ ఆరోగ్యం ఓకే: గంగారామ్ వైద్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడుతుందని, ఆమె బాగా కోలుకుంటున్నారని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సోనియా జ్వరం పూర్తిగా తగ్గిందని. ఆరోగ్య పరిస్థితిలో పురోగతి వచ్చిందని తెలిపారు.

ఇప్పటికే ఈ ఆసుపత్రిలో సోనియా భుజానికి శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. 10 రోజుల క్రితం వారణాసి పర్యటన సందర్భంగా అస్వతకు గురైన సోనియా గాంధీని మొదట ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. సోనియా గాంధీ ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.
కాంగ్రాస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల శాసన సభ్యులు గంగారామ్ ఆసుపత్రి చేరుకుని సోనియా గాంధీని పరామర్శించారు. ఆమె త్వరగా కొలుకోవాలని ప్రార్థనలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications