బట్టలిప్పేసి..: సోనియా, రాహుల్‌లపై బిజెపి ఎమ్మెల్యే

రాజస్థాన్ టోంక్ నియోజకవర్గంలోని ఎన్నికల ర్యాలీలో బిజెపి శాసనసభ్యుడు హీరాలాల్ రేగార్ ఆ వ్యాఖ్యలు చేశారు. రేగార్ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన వ్యాఖ్యలకు రేగార్ ఓ టీవీ చానెల్‌లో క్షమాపణలు చెప్పారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఎవరి పేరూ ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడితే అందుకు క్షమాపణలు చెబుతున్నానని రేగార్ అన్నారు. మోడీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు షహరాన్పూర్ కాంగ్రెసు అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మర్నాడే ఈ సంఘటన చోటు చేసుకుంది.
విద్వేషపూరిత ప్రసంగానికి మసూద్‌ను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. మసూద్ వ్యాఖ్యలను ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ఖండించారు.












Click it and Unblock the Notifications