మన్మోహాన్‌కు సోనియా, రాహుల్ కంగ్రాట్స్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: జపాన్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం అందుకున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ను అభినందించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఆయనతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం ఇక్కడి మోతీలాల్ నెహ్రూ నివాసంలో మన్మోహాన్‌ను కలిసి అభినందించింది. మాజీ ప్రధానిని కలిసిన వారిలో మల్లిఖార్జున్ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, రాజ్యసభ మరో సభ్యుడు కరణ్‌సింగ్ తదితరులు ఉన్నారు.
గత 35 సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను "ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలొనియా ప్లవర్స్" పురస్కారానికి జపాన్ ప్రధాని షింజో అబే నాయకత్వంలోని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్ నిర్వహించిన వేడుకలో జపాన్ దేశాధినేత అకిహితో మన్మోహన్‌కు అవార్డు అందజేశారు. అనంతరం అకిహితో, రాణి మిచికో 82ఏళ్ల సింగ్, ఆయన సతీమణి గుర్షరణ్‌కు విందు ఇచ్చారు. ‘ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పలోనియా ఫ్లవర్స్' అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా కూడా మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు.

మన్మోహాన్‌ను అభినందించిన సోనియా, రాహుల్
జపాన్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం అందుకున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ను అభినందించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఆయనతో సమావేశమయ్యారు.

మన్మోహాన్‌ను అభినందించిన సోనియా, రాహుల్
టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్ నిర్వహించిన వేడుకలో జపాన్ దేశాధినేత అకిహితో మన్మోహన్‌కు అవార్డు అందజేశారు.

మన్మోహాన్‌ను అభినందించిన సోనియా, రాహుల్
అనంతరం అకిహితో, రాణి మిచికో 82ఏళ్ల సింగ్, ఆయన సతీమణి గుర్షరణ్‌కు విందు ఇచ్చారు. ‘ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పలోనియా ఫ్లవర్స్' అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా కూడా మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు.

మన్మోహాన్‌ను అభినందించిన సోనియా, రాహుల్
గత 35 సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను "ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలొనియా ప్లవర్స్" పురస్కారానికి జపాన్ ప్రధాని షింజో అబే నాయకత్వంలోని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications