కిరణ్ సిఫార్సు: అయినా లగడపాటికి సోనియా నో

ముఖ్యమంత్రి సిఫార్సు చేసినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరస్కరించినట్లు తెలిసింది. సీమాంధ్ర పార్టీ పార్లమెంటు సభ్యుల మనోభావాలను లగడపాటి రాజగోపాల్ వెల్లడిస్తారని, లగడపాటికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌కు ఫోన్ చేసి చెప్పారు.
అయితే తాము సీమాంధ్ర ఎంపీలను సదస్సుకు రానిస్తామేగానీ, మాట్లాడే విషయం మేడమే ఖరారు చేయాల్సి ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు సమాచారం. అనంతరం కిరణ్ ప్రతిపాదనను జనార్దన్ ద్వివేది ద్వారా మేడమ్ దృష్టికి దిగ్విజయ్ తీసుకురాగా, ఆమె తిరస్కరించినట్టు తెలిసింది.
సజావుగా జరుగుతున్న సమావేశాల్లో విభజన అంశం ప్రస్తావనకు రావడం సరైంది కాదని, వారు మాట్లాడేందుకు అనేక ఇతర వేదికలపై ఇప్పటికే అవకాశం కల్పించామని సోనియా చెప్పినట్లు తెలిసింది. నిజానికి రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు మాట్లాడించేందుకు మేడమ్ తొలుత అంగీకరించారని, లగడపాటి అంశం ముందుకురావడంతో అసలు రాష్ట్ర నేతలెవరికీ అవకాశం కల్పించకూడదని సోనియా నిర్ణయించుకున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications