సోనియా వచ్చేశారు: ఇన్నాళ్లు అమెరికాలోనే చికిత్స తీసుకున్నారా!?

Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడిచిన కొన్ని నెలలుగా విదేశాల్లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది అగస్టులో వారణాసి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుంచి విదేశాల్లోను చికిత్స పొందుతూ వస్తున్నారు.

ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యం కుదుటపడటంతో ఆమె విదేశాల నుంచి ఇండియా తిరిగొచ్చేశారు. అయితే విదేశాల్లో ఆమె ఎక్కడ చికిత్స చేయించుకున్నారన్నది మాత్రం ఇంతవరకు అధికారికంగా తెలియరాలేదు. అదే సమయంలో అమెరికాలో సోనియా చికిత్స చేయించుకుని ఉండవచ్చునని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. శుక్రవారం ఇండియాలో అడుగుపెట్టిన సోనియా గాంధీ వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.

Sonia, Rahul return to India from US

మార్చి తొలివారంలోనే విదేశాలకు వెళ్లిపోయిన సోనియాగాంధీ.. ఎన్నికల ఫలితాల సమయంలోను అక్కడే ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. సోనియా ఆరోగ్యం కుదుటపడటంతో మార్చి 16న రాహుల్ గాంధీ తల్లిని తీసుకొచ్చేందుకు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress president Sonia Gandhi and vice-president Rahul Gandhi have returned to India from the United States, said reports. Both returned to the national capital on Thursday evening.
Please Wait while comments are loading...