న్యూస్ పేపర్ ఫండ్స్: సోనియా, రాహుల్‌లకు సమన్లు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై కాంగ్రెసు అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. ఆ పత్రిక ఏళ్ల క్రితం మూతపడింది.

నిందితులందరిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా అన్నారు. యంగ్ ఇండియన్ అనే కొత్త ప్రైవేట్ కంపెీ వార్తాపత్రిక ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి కోర్టుకు ఎక్కారు.

Sonia, Rahul Summoned for Misappropriating Newspaper's Funds

కొత్త కంపెనీకి సోనియా, రాహుల్ గాంధీ డైరెక్టర్లు. వారికి ఇందులో 76 వాటా ఉంది. మిగతా వాటాలు కాంగ్రెసు నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు ఉన్నాయి. వారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. అది 2008లో మూతపడింది. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకోవడానికి యంగ్ ఇండియన్ వడ్డీ రహిత రుణాలను ఆ నాయకులు ఇచ్చారని స్వామి ఆరోపించారు. అసోసియేటెడ్ జర్నల్స్‌కు చెందిన 500 కోట్ల రూపాయలను సొంతం చేసుకోవడానికి వారికి ఎఐసిసికి చెందిన 90 కోట్ల రూపాయలను వాడుకుని కంపెనీ అనుమతి ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+