Coronavirus: మీరే రియల్ హీరోస్, వైద్య సిబ్బందికి ‘జుహూ’ హోటల్‌లో వసతి: సోనూ సూద్

కరోనా వైరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్‌తో పోరాడుతోన్న రోగుల కోసం ప్రభుత్వాలకు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. మరికొందరు వసతి కోసం గృహ సముదాయాలను అందజేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సోను సూద్ తన హోటల్‌లో వైద్య సిబ్బంది ఉండేందుకు వసతి కల్పించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఆపద సమయంలో వైరస్ సోకిన వారికి సేవలు అందిస్తోన్న వారిని సోనూసుద్ కొనియాడారు. వారికి వసతి కల్పించేందుకు తన హోటల్‌ తెరుస్తున్నానని పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా అన్ని హోటళ్లు, వ్యాపార సముదాయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. డాక్టర్లు, వైద్య సిబ్బందికి వసతి కల్పించడం గౌరవంగా భావిస్తున్నానని సోనూ సూద్ పేర్కొన్నారు. రేయనక, పగలనక కష్టపడి, లక్షలాది మందికి సేవలు కల్పిస్తున్న వారికి ఇసుమంతైన సాయం చేసే అవకాశం లభించిందని చెప్పారు. మీరే రియల్ హీరోస్ అంటూ సోనూ సూద్ ప్రశంసలు కురిపించారు.

Sonu Sood Offers His Juhu Hotel For Healthcare Workers..

ముంబైలో గల తన నాలుగు అంతస్తుల కార్యాలయ భవనాన్ని క్వారంటైన్ కోసం వాడుకోవాలని బాలీవుడ్ బాద్ షా కోరారు. షారుఖ్ ఖాన్ ఉదారతపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. సినీ కూలీల కోసం హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ చేయూతనిచ్చిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+