" 5, 10, 20, 50, 100 రూపాయల నోట్లు కూడా రద్దు కాబోతున్నాయి.."
న్యూఢిల్లీ : రూ.500, రూ.2000 వేల కొత్త నోట్లే కాదు.. త్వరలో రూ.5,రూ.10,రూ.20,రూ.50,రూ.100 నోట్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీని సమూలంగా మార్చేసి.. కొత్త డిజైన్స్ తో కూడిన నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా పలు కీలక విషయాలు వెల్లడించారు.
రద్దు చేసిన రూ.1000నోటు స్థానంలోను కొత్త వెయ్యి నోటు వస్తుందని శశికాంత్ గుప్తా ప్రకటించారు. కరెన్సీని సమూలంగా మార్చేయడంతో పాటు మరిన్ని అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడించడమే లక్ష్యంగా అన్ని కరెన్సీ నోట్లనూ రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త నోట్లను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్టు శశికాంత్ తెలిపారు.

గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. శశికాంత్ ఈ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం రూ.500, రూ.2వేల నోట్లకు సంబంధించిన బట్వాడా శరవేగంగా జరుగుతోందని, భద్రతా రీత్యా 3 వేల మంది పారామిలిటరీ, పోలీసు, క్విక్ రియాక్షన్ టీములతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications