డెల్టా కంటే భిన్నంగా ఒమిక్రాన్ బాధితుల్లో లక్షణాలు: జలుబుతోపాటు ఈ సిమ్టప్స్ కూడా

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన ఓ లక్షణాన్ని గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలోనే మొదటగా వెలుగుచూసిన విషయం తెలిసిందే.

Recommended Video

    Omicron Variant : Omicron Is 70 Times Faster Than Delta | Omicron Cases In India
    ఒమిక్రాన్ సోకితే భిన్నమైన లక్షణాలు

    ఒమిక్రాన్ సోకితే భిన్నమైన లక్షణాలు

    ఒమిక్రాన్ సోకినవారిలో స్వల్పంగా విభిన్న లక్షణాలు బయటపడున్నాయని
    దక్షిణాఫ్రికా దేశానికి చెందిన డిస్కవరీ హెల్త్ సీఈవో రేయాన్ నోచ్ తెలిపారు. ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన వారికి తొలి దశలో గొంతు నొప్పి, ముక్కు దిబ్బెడ కనిపిస్తున్నాయనని వెల్లడించారు. అక్కడివారిలో తలనొప్పి, అలసట వంటి లక్షణాలు అదనంగా కనిపిస్తున్నట్లు తెలిపారు.

    ఒమిక్రాన్ సోకితే సాధారణ జలుబు లక్షణాలతోపాటు..

    ఒమిక్రాన్ సోకితే సాధారణ జలుబు లక్షణాలతోపాటు..


    కాగా, యూకేలో డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరిగిన విశ్లేషణలో వీటిని గుర్తించారు. ఇటువంటి లక్షణాలే సహజంగా జలుబులో కూడా కనిపిస్తాయి. యూకేలోని జో సిమ్టమ్ ట్రాకింగ్ స్టడీలోనూ కొన్ని లక్షణాలు గుర్తించారు. ముక్కు కారడం, తలనొప్పి వంటి లక్షణాలు స్వల్పంగా లేదా తీవ్రంగా ఉంటున్నట్లు తేలింది. అంతేగాక, తుమ్ములు, గొంతునొప్పి కూడా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. కరోనావైరస్ డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఒమిక్రాన్ లక్షణాలు కొంత భిన్నంగా ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

    డెల్టా కంటే భిన్నంగా ఒమిక్రాన్ లక్షణాలు

    డెల్టా కంటే భిన్నంగా ఒమిక్రాన్ లక్షణాలు


    డెల్టా వేరియంట్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి-వాసన కోల్పోవడం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయి. జో కరోనా స్టడీ ప్రధాన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకినవారికి జలుబు లక్షణాలే ఎక్కువ ఉంటున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని, కరోనా కావచ్చని అన్నారు. టెస్టులు చేయించుకోవాలన్నారు. బూస్టర్ డోసులు తీసుకున్నవారిలో అతిస్వల్ప లక్షణాలతో కరోనా సోకినట్లు గమనించామని పేర్కొన్నారు. కాగా, యూకేలో ఒమిక్రాన్ అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఒక మరణం కూడా సంభవించింది. మరోవైపు అమెరికాలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఒమిక్రాన్ మరణం సంభవించింది. మరోవైపు భారతదేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వరకు దేశంలో 200కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా వైరస్ కేసులు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+