వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాతో పెట్టుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తా: సీఎం పళనిసామికి మంత్రి వార్నింగ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. తన మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని కుప్పకూల్చేస్తానని పరోక్షంగా సీఎం పళనిసామినే హెచ్చరిస్తున్నారని వెలుగు చూసింది.

<strong>పళనిపామి ప్రభుత్వం పతనం ? పన్నీర్ సెల్వం చెప్పిన మరుసటి రోజే ఇలా!</strong>పళనిపామి ప్రభుత్వం పతనం ? పన్నీర్ సెల్వం చెప్పిన మరుసటి రోజే ఇలా!

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా టీటీవీ దినకరన్ కు మద్దతుగా ఓటు వెయ్యాలని విచ్చలవిడిగా డబ్బు పంపిపెడుతున్నారని వెలుగు చూడటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద దాడులు చేసిన విషయం తెలిసిందే.

మంత్రి తిరుగుబాటు ?

మంత్రి తిరుగుబాటు ?

శశికళ, మన్నార్ గుడి మాఫియా, టీటీవీ దినకరన్ అండతో మంత్రి అయిన విజయభాస్కర్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు. నా పదవి పోతే సీఎం పదవిపోయినట్లే అంటూ సోమవారం ధిక్కారస్వరం పెంచారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు అంటున్నాయి.

మంత్రి మీద వేటు వెయ్యాలని ?

మంత్రి మీద వేటు వెయ్యాలని ?

ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే సమయంలో తాను కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భారీ మొత్తంలో కమీషన్లు ( లంచం) ఇచ్చానని కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని, వాటి వివరాలు ఉన్న డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూసింది.

డైరీలో టాప్ లిస్ట్ లో ఈయన పేరు

డైరీలో టాప్ లిస్ట్ లో ఈయన పేరు

తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను వివరిస్తూ ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి లేఖ రాశారు. మంత్రులు, ఎమ్మెల్యేల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు సీఎంకు లేఖ రాశారని, అందులో మొదటి పేరు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ దే అని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

కాంట్రాక్టర్ ఆత్మహత్య ?

కాంట్రాక్టర్ ఆత్మహత్య ?

మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణ్యం ఆదివారం అర్దరాత్రి నమ్మక్కల్ లోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విసయంలో ముఖ్యమంత్రి పూర్తి సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది.

పదవి పీకేద్దాం అంటున్న సీఎం

పదవి పీకేద్దాం అంటున్న సీఎం

విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని పలువురు సీనియర్ మంత్రులు సీఎం పళనిసామి మీద ఒత్తిడి తీసుకు వచ్చారని సమాచారం. సీనియర్ మంత్రుల నిర్ణయంతో ఏకీభవించిన సీఎం పళనిసామి విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారని తెలిసింది.

లీక్ చేశారు. సీఎం సీటుకు ఎసరు

లీక్ చేశారు. సీఎం సీటుకు ఎసరు

తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న విజయభాస్కర్ ఏకంగా సీఎంనే టార్గెట్ చేసుకుని వార్నింగ్ ఇస్తున్నారని సొంత వర్గంలోని నాయకులు అంటున్నారు. తన పదవి పోతే అందరి బండారం మొత్తం బయటపెడుతానని, అప్పుడు ప్రభుత్వమే కుప్పకూలిపోతోందని విజయభాస్కర్ హెచ్చరిస్తున్నారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకులు అంటున్నారు.

ఎవరు లీక్ చేశారు ?

ఎవరు లీక్ చేశారు ?

విజయభాస్కర్ ను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించిన విషయం ఆయనకు ఎవరు చెప్పారు అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆరా తీస్తున్నారని సమాచారం. తనపదవికే ఎసరుపెడుతున్నారని తెలుసుకున్న ఎడప్పాడి పళనిసామి విజయభాస్కర్ మీద సీరియస్ గా ఉన్నారని తెలిసింది.

English summary
Sources said that Tamil Nadu Minister Vijayabaskar has threatened to topple the Edappadi Palanisamy Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X