Cheetah: చీతాలు ఎందుకు చనిపోతున్నాయో చెప్పిన దక్షిణాఫ్రికా..!
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఇప్పటి వరకు రెండు మృతి చెందాయి. చీతాల మృతిపై దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (DFFE) గురువారం స్పందించింది. ఈ తరహా ప్రాజెక్ట్‌లో మరణాలు ఉంటాయని ఊహించిన పరిణామమేనని తెలిపింది.
పెద్ద పెద్ద మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని పెంచడం చాలా సంక్షిష్టమైన పని పేర్కొంది. అంతేకాకుండా కొన్ని జంతువులు కొత్త వాతావరణానికి అలవాటు పడలేవని.. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయని ఒక ప్రకటనలో వివరించింది.

సెప్టెంబర్ 2022లో నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌కి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చారు. మరణించిన చిరుతల్లో ఒకటి నమీబియాకు చెందినది కాగా మరొటి దక్షిణాఫ్రికాకు చెందిన చిరుత. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చీతాలను ఇండియాకు తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్ 17 నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చారు. వాటిలో సాశా అనే చీతా మృతి చెందింది.
రెండో విడతలో 2023 ఫిబ్రవరిలో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. ఇందులో ఉదయ్ అనే మగ చీతా మృతి చెందింది. అయితే నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (DFFE) చిరుత మరణానికి సంబంధించి రోగనిర్ధారణ (శవపరీక్ష) కోసం వేచి ఉన్నామని చెప్పింది. దక్షిణాఫ్రికా చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లలో ఉన్నాయి.
చీతాలను ప్రతిరోజూ రెండుసార్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. దక్షిణాఫ్రిక నుంచి తీకొచ్చిన 12 చీతాల్లో ఒకటి మృతి చెందగా.. మిగిలిన పదకొండు దక్షిణాఫ్రికా చిరుతలను రాబోయే రెండు నెలల్లో ఎన్ క్లోజర్ నుంచి బయటకు వదలనున్నారు. కునో అనేది కంచె లేని రక్షిత ప్రాంతం. ఇది చిరుతపులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, చారల హైనాలతో సహా పలు జంతువులకు అవాసంగా ఉంది.












Click it and Unblock the Notifications