బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలోకి పందెంకోడి ?, క్వీన్ కంగనా ఎఫెక్ట్, ఫ్యాన్స్ ఫైర్, క్లారిటీ ఇచ్చిన హీరో, ఆంధ్రా, తెలంగాణ

|
Google Oneindia TeluguNews

చెన్నై/ ముంబాయి/ న్యూఢిల్లీ: మాస్ హీరో, బహుబాష నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికై సత్తాచాటుకున్న'పందెంకోడి' విశాల్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ సారి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విఫలయత్నం చేసిన విశాల్ కొన్ని ఆనివార్య కారణాల వలన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడితో భేటీ కావడానికి హీరో విశాల్ సిద్దంఅయ్యారని ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ ను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో కంగనా రనౌత్ కు బీజేపీ మద్దతు తెలపడం, విశాల్ బీజేపీ నేతలతో కలవడానికి సిద్దం కావడంతో కథ కొత్తమలుపు తిరిగింది. హీరో విశాల్ బీజేపీలో చేరితో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మనకు లాభం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోందని తెలిసింది. ఈ విషయంపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు.

Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !

 క్వీన్ కంగనా దెబ్బతో కలాస్

క్వీన్ కంగనా దెబ్బతో కలాస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును క్వీన్ మణికర్ణిక కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే మహారాష్ట్ర-కంగనా రనౌత్ మద్య వార్ తారాస్థాయికి చేరింది.

 హీరో విశాల్ ఎంట్రీతో కలకలం

హీరో విశాల్ ఎంట్రీతో కలకలం

మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన నాయకులతో ఒంటరిపోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు, ఆమె అభిమానులు అండగా నిలిచారు. ఇదే సహయంలో ప్రముఖ హీరో, నిర్మాత విశాల్ సైతం కంగనా రనౌత్ ను భగత్ సింగ్ తో పోల్చుతూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. సంచలన నటి కంగనా రనౌత్ కు హీరో విశాల్ బహిరంగంగా మద్దతు ఇచ్చి మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

 నా దారి రహదారి అంటున్న బీజేపీ, విశాల్

నా దారి రహదారి అంటున్న బీజేపీ, విశాల్

క్వీన్ కంగనా రనౌత్ కు జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమెకు అండగా నిలిచారు. హీరో విశాల్ సైతం కంగనా రనౌత్ కు మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు కేఎల్. మురుగన్ ను కలవడానికి హీరో విశాల్ అపాయింట్ మెంట్ కోరారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కంగనా రనౌత్ కు బహిరంగ మద్దతు ఇచ్చిన హీరో విశాల్ ఇదే సమయంలో బీజేపీ నాయకులతో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నారని తెలియడంతో ఆయన కచ్చితంగా బీజేపీలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

 ఎమ్మెల్యేగా జస్ట్ మిస్

ఎమ్మెల్యేగా జస్ట్ మిస్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో అప్పట్లో చెన్నైలోని ఆర్ కే నగర్ లో శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. అప్పట్లో ఆర్ కేనగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి హీరో విశాల్ ప్రయత్నించారు. ఆర్ కే నగర్ లో మెజారిటీ ఓటర్లు తెలుగు వాళ్లే. అయితే ఆనివార్య కారణాలతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించడంతో హీరో విశాల్ పోటీ నుంచి తప్పుకున్నారు. తమిళ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడి ఎన్నికల్లో, దక్షిణ భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన హీరో విశాల్ విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు.

 జస్ట్ బ్రేక్ మిత్రమా.... సినిమా ఇంకా ఉంది

జస్ట్ బ్రేక్ మిత్రమా.... సినిమా ఇంకా ఉంది

ఏదో ఒక ఎన్నికల విషయంలో హీరో విశాల్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే కొన్ని ఆనివార్య కారణాల వలన హీరో విశాల్ ఇటీవల కాలంలో మీడియాకు దూరం అయ్యారు. ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులతో హీరో విశాల్ కు పరిచయాలు ఉన్నాయి. అంతే కాకుండా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో హీరో విశాల్ కు ప్రత్యేక అభిమాన సంఘాలు, ఆయన వర్గం మద్దతు పుష్కలంగా ఉంది. ఇలాంటి సమయంలో హీరో విశాల్ బీజేపీ నాయకులతో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

 ఏక్ మార్ తీన్ తుకుఢా

ఏక్ మార్ తీన్ తుకుఢా

హీరో విశాల్ బీజేపీలో చేరితే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో తమకు లాభం ఉంటుందని కొందరు బీజేపీ నాయకులు అంచనా వేశారు. అయితే హీరో విశాల్ బీజేపీలో చేరడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు బీజేపీలో చేరడం ఏమిటి ? మాకు ఇష్టం లేదు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చెయ్యడంతో హీరో విశాల్ షాక్ అయ్యారు.

 పందెంకోడి క్లారిటి

పందెంకోడి క్లారిటి

హీరో విశాల్ బీజేపీలో చేరే విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్ కే. మురుగన్ ను కలవడం లేదని, తాను బీజేపీలో చేరడం లేదని సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కొంచెం శాంతించారు. అయితే హీరో విశాల్ లను బీజేపీలోకి ఆహ్వానించాలని కొందరు జాతీయ స్థాయి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద పందెంకోడి విశాల్ తాను బీజేపీలోచేరడం లేదని ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

English summary
South India Hero Vishal is not joining in the BJP, clarifies the actor Vishal after fake news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X