అందుకే అక్కడి నుంచి పోటీచేస్తున్నా : రాహుల్ గాంధీ
Recommended Video

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటంపై వాడివేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కంచుకోట అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి ఆయన బరిలో దిగుతుండటంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ రెండో సీటు నుంచి బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాది ప్రజల్లో మోడీ తమను శత్రువులా చూస్తున్నారని, దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ వారి అభిప్రాయం తీసుకోవడంలేదన్న భావన నెలకొందన్న విషయాన్ని తాను గమనించానని రాహుల్ అన్నారు. వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే వయనాడ్ నుంచి పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. వయనాడ్ నుంచి బరిలో దిగుతున్న రాహుల్ గాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications