వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళని తాకిన రుతుపవనాలు: 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ/తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతు పవనాలు మాల్దీవ్‌, కొమరిన్‌తోపాటు దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ కేరళలో ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఇప్పటికే, తిరువనంతపురంలో భారీ వర్షం పడింది. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. నైరుతీ ఆగమనం వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే వచ్చింది.

Southwest monsoon hits Kerala and Lakshadweep, 1 dead

కేరళ, లక్ష్వద్వీప్‌ను రుతుపవనాలు బుధవారం తాకాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కేరళలోని పలుచోట్ల మంగళవారం రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. జూన్ 9వ తేదీ లోగా రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ఇంతకుముందే ప్రకటించింది.

ఇదిలా ఉండగా, వర్షాల వల్ల చనిపోయిన ఇడుక్కి జిల్లా వ్యక్తి పేరు జోబి జాన్. అతని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు. అతని తల్లికి కూడా గాయాలయ్యాయి. వీరి ఇంటి పైన రాళ్లు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. అతని తండ్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతను చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.

English summary
Monsoon on Wednesday hit Kerala and Lakshadweep with heavy rains claiming the life of a 36-year-old man following a landslip in Idukki district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X