• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్పీ బాలు ఆరోగ్యంపై గుడ్‌న్యూస్ - కరోనాను జయించిన గాన గంధర్వుడు - ఐపీఎల్ కోసం ఆత్రుతగా..

|

కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయి.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఇప్పటికీ వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే చికిత్స కొనసాగుతున్నది. ఈ విషయాలను బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజులుగా ఎస్పీబీ హెల్త్ అప్ డేట్స్ లేకపోవడంతో ఆందోళనకు గురవుతోన్న అభిమానులకు శుభవార్తగా చరణ్ సోమవారం నాటి వీడియోలో పలుఅంశాలను వెల్లడించారు.

  నాన్న IPL 2020 కోసం వెయిట్ చేస్తున్నారు | SP Charan on SP Balasubrahmanyam's Health

  ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

  కేసీఆర్ జాతీయ పార్టీని జగన్ అంగీకరించరు - పెడితే నవ్వులపాలే - విపక్ష నేతల విసుర్లు

  క్షమించాలంటూ మొదలుపెట్టి..

  క్షమించాలంటూ మొదలుపెట్టి..

  తండ్రి ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై గత వారాంతంలో అప్ డేట్స్ ఇవ్వలేకపోయినందుకు అందరూ క్షమించాలంటూ ఎస్పీ చరణ్ తన వీడియో సందేశాన్ని మొదలుపెట్టారు. గతంతో పోల్చుకుంటే, బాలు ఆరోగ్యం బాగా మెరుగుపడిందని, వెంలిటేటర్ తొలిగిస్తారని భావించినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉండటంతో వెంటిలేటర్, ఎక్మోను కొనసాగిస్తున్నారని చరణ్ తెలిపారు.

  ఇది నిజంగా శుభవార్త..

  ఇది నిజంగా శుభవార్త..

  ‘‘నాన్నకు సంబంధించి శుభవార్త ఏంటంటే.. తాజాగా జరిపిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగటివ్ అని రిపోర్టు వచ్చింది. అయితే, ఇక్కడ పాజిటివా, నెగటివా అన్నది సమస్యకాదు. నాన్న ఊపిరితిత్తులు త్వరగా మెరుగవ్వాలి. అందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారు. ఫిజియో థెరపీ కొనసాగుతున్నది..''అని చరణ్ చెప్పారు.

  ఐసీయూలోనే 51వ పెళ్లిరోజు..

  ఐసీయూలోనే 51వ పెళ్లిరోజు..

  చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఎస్పీ బాలు.. తానుంటోన్న ఐసీయూ వార్డులోనే శనివారం పెళ్లిరోజును జరుపుకొన్నారు. ఈ వీకెండ్ లో అమ్మానాన్నల మ్యారేజ్ డే సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేశామని కొడుకు చరణ్ తెలిపారు. ఎస్పీ బాలు స‌తీమ‌ణి సావిత్రి సహా కుటుంబీకులు ఆసుప‌త్రికి వెళ్లగా, వైద్యుల స‌మక్షంలో, అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ శ‌నివారం సాయంత్రం దంప‌తులు కేక్ క‌ట్ చేసి 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్న‌ట్లు వెల్లడైంది. ఆగస్టు 5 నుంచి ఆస్పత్రిలో ఉంటోన్న బాలుకు సోమవారం కరోనా నెగటివ్ రిపోర్టు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వెలిబుచ్చారు. ఆయన పూర్తిగా కోలుకుని త్వరగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు.

  కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

  English summary
  Singer SP Balasubrahmanyam has tested negative for the novel coronavirus, said his son SP Charan in a new video. He further added that SPB's lungs are healing and the doctors are hoping to take him off the ventilator soon. Charan also revealed that SPB is fully awake and responsive. He has been keeping himself occupied by watching a lot of tennis and cricket matches on his iPad.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X