నా పేరు ముందు అవి వాడకండి - ఎస్పీ బాలు రాసిన లేఖ వైరల్- గాన చంద్రుడన్న సోనియా గాంధీ
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం చెన్నైలో ముగిశాయి. తిరిగిరాని లోకాలకు వెళ్లిన గాయకుణ్ని తలుచుకుంటూ అభిమానులందరూ ఆయన తలంపులతోనే కాలంగడుపుతున్నారు. బాలు కన్నుమూసిన తర్వాత... ఆయన గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు సెలబ్రిటీలు బాలు మరణంపై సంతాపాలు తెలిపారు.

ఆ లేఖలో ఇలా..
అందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. నవంబర్ 30న మీ కార్యక్రమానికి తప్పక రాగలను.. కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరారు.. అందులో ముఖ్యంగా.. నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్, గానగంధర్వ వంటి విశేషణలు వేయకండి.. మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రయాణ వివరాలను తర్వాత చెప్పగలను.. అంటూ లేఖను ముగించారు. బాలు ఎప్పుడో రాసిన ఓ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

గానచంద్రుడు బాలు..
శ్రావ్యమైన స్వరంతో భావోద్వేగ శక్తితో పలు భారతీయ భాషల్లో పాటలు పాడి, దేశ సంగీత, సాస్కృతిక రంగంలో ధృవతారగా వెలుగొందారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లెజెండరీ సింగర్ కు నివాళులు అర్పించారు. కళారంగంలో బాలు లేని లోటు పూడ్చలేనిదని, ‘గాన చంద్రుడి'గా ఆయన తన ప్రకాశాన్ని వెదజల్లుతూనే ఉంటారని సోనియా కీర్తించారు. 74 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం కరోనా కు చికిత్సి పొందుతూ, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Recommended Video

ఎస్పీబీని గుర్తుంచుకోవాలంటే..
నటుడు మాధవన్ బాలుకు సంబంధించిన వీడియో ఒకదానిని శనివారం అభిమానులకు షేర్ చేశారు. అందులో బాలు.. ‘‘నేను చనిపోవాలని అనుకోవడం లేదు'' అని చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ.. ‘‘ఈ లెజెండ్‌ని గుర్తుంచుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు.. ఆయనని గుర్తుంచుకున్నట్లే‘‘ అని మాధవన్ రాసుకొచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications