త్యాగానికి సిద్ధం..2019లో ఎస్పీ బీఎస్పీలు కలిసే పోటీచేస్తాయి: అఖిలేష్
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఉపఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బీఎస్పీతో మద్దతుతో ఉపఎన్నికల్లో విజయబాహుటా ఎగురవేసిన సమాజ్ వాదీ పార్టీ...2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. మాయావతి పార్టీతో పొత్తు కొనసాగుతుందని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ ఓటమే తమ అంతిమ లక్ష్యం అన్నారు అఖిలేష్.
ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వరసగా జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది. బలమైన కమలం పార్టీని మట్టుబెట్టేందుకు బద్ద శత్రువులైన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలపడంతో... యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు చెందిన గోరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పూల్ పూర్ లోకసభ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా కైరానా పార్లమెంటు స్థానాన్ని సైతం విపక్షాలు తమ ఖాతాలో వేసుకోవడంతో ... ఇదే ఫార్ములాను 2019లో కూడా కొనసాగించాలని ఎస్పీ బీఎస్పీ పార్టీలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... బీఎస్పీకి తాము అనుకున్న సీట్లు ఇస్తే ఎస్పీతో కలిసి వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాయావతి తెలిపారు. బీజేపీని ఓడించడమే ప్రస్తుతం తమ ముందున్న టార్గెట్‌గా చెప్పుకొచ్చారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఒక కొలిక్కి రాదని..2019 ఎన్నికలకు ముందే అఖిలేష్, మాయావతిల మధ్య విబేధాలు వచ్చి విడిపోతారని ఆ రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications