మార్చి 10 తర్వాత "బల్డోజర్ బాబా" పనిపడతాం : సీఎం యోగికి అఖిలేష్ యాదవ్ కౌంటర్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. ఆదివారం ( ఫిబ్రవరి 20వ తేది )తో మూడు విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో నాలుగో విడత నిర్వహించే అసెంబ్లీ స్థానాలపై పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

 యోగికి కౌంటర్

యోగికి కౌంటర్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు కొత్త పేరు పెట్టారు. ఆయనకు "బల్డోజర్ బాబా" అని సంబోధిస్తూ సెటైర్లు విసిరారు. రెండు రోజు క్రితం ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సీఎం యోగి.. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని పనిపడతాం మంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తూ .. అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు.

"బల్డోజర్ బాబా" ప‌నిప‌డ‌తాం


ఎన్నికల ప్రచారంలో పదే పదే బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ప్రస్తావించిన యోగిని "బల్డోజర్ బాబా" అంటూ అఖిలేష్ యాదవ్ పేరు పెట్టారు. అయోధ్యలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మార్చి 10 త‌ర్వాత "బల్డోజర్ బాబా" ప‌నిప‌డ‌తామంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ పాలనలో పేర్లు మార్చడం తప్ప ప్ర‌జ‌ల‌కు సీఎం యోగి చేసిందేమి లేదని విమర్శించారు. బీజేపీ నేతలు ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. బుల్డోజర్ బాబా పేరు యోగికి కరెక్టుగా సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు.

 బీజేపీపై ర‌గిలిపోతున్న జ‌నం..

బీజేపీపై ర‌గిలిపోతున్న జ‌నం..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్లచట్టాల పట్ల వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కూడా జనం వెనక్కి పంపిస్తారని విమర్శించారు. యూపీ ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆపార్టీని తరిమికొట్టడం ఖాయమన్నారు. బీజేపీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి కమలం నేతలకు అర్థమైందన్నారు. అందుకే వారి భాష, ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్ర‌శాంతంగా ముగిసిన మూడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్

ప్ర‌శాంతంగా ముగిసిన మూడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్

మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కర్హల్ స్థానం నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల్లో ఎస్పీ కూటమిదే హవా అని పేర్కొన్నారు. యూపీలో అధికారం చేపట్టబోయేది తామేనని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెడువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+