యూపీలో ఫోన్ల ట్యాపింగ్ దుమారం.. యోగి సర్కార్‌పై విప‌క్షాల ముప్పేట దాడి

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ స్పీడ్ ను పెంచాయి. అధికార, విప‌క్ష నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ సర్కార్ ను గద్దెదించేందుకు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా యోగి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు

మా ఫోన్ల ట్యాపింగ్.. రికార్డులు వింటున్న యోగి..

మా ఫోన్ల ట్యాపింగ్.. రికార్డులు వింటున్న యోగి..

స్వయంగా ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రతిరోజూ సాయంత్రం మా ఫోన్ రికార్డింగులను వింటున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీలో దారిలోనే నడుస్తోందని విమర్శించారు. ప్రతిప‌క్షాలను భయభ్రాంతులకు గురిచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిఘా సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్య‌క్త‌మవుతోందన్నారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు.

యూపీ-యోగి=ఉపయోగి

యూపీ-యోగి=ఉపయోగి

ప్రధాని మోదీ పాలన విఫలమైందన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేశారని అఖిలేష్ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను అఖిలేష్ తప్పపట్టారు. యూపీ-యోగి= అన్ ఉపయోగి అంటూ విమర్శలు చేశారు.

మతం పేరుతో బీజేపీ రాజకీయాలు

మతం పేరుతో బీజేపీ రాజకీయాలు

అటు యోగి సర్కార్ పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ నిప్పులు చెరిగారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

 మీడియాపై రాహుల్ విసుర్లు

మీడియాపై రాహుల్ విసుర్లు


అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , ఎంపీ రాహుల్ గాంధీ మీడియాపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల‌ గొంతును మీడియా అణచివేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీకి కొమ్ముకాస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల‌ గొంతుకను ప్రజలకు చేరవేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలను నిర్భయంగా భ‌యటపెట్టాల‌ని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+