అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. భార్య, కుమార్తెకు పాజిటివ్

దేశంలో ఒక వైపు కరోనా, మరో వైపు ఒమిక్రాన్ వ్యాప్తి కలవరపెడుతుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ వెంటాడుతుంది. మంగళవారం బీఏస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ , కూతురు టీనాల‌కు కరోనా వైరస్ సోకింది.

అఖిలేఖ్ యాదవ్ భార్య, కుమార్తెకు కరోనా

అఖిలేఖ్ యాదవ్ భార్య, కుమార్తెకు కరోనా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న‌ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇంట్లో మహమ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. అఖిలేష్ భార్య , మాజీ ఎంపీ డింపుల్ యాద‌వ్‌కు కరోనా సోకింది. వారి కుమార్తె టీనాకు కూడా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.. ఈ విష‌యాల‌ను డింపుల్ యాద‌వ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించింది.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే..

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే..

తాను రెండు డోసుల వ్యాక్సిన తీసుకున్నపటికీ తనకు కరోనా సోకిందని డింపుల్ తెలిపారు. ప్రస్తుతం త‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా లక్నోలోని తమ నివాసంలోనే తాము ఐసోలేష‌న్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాలని డింపులు సూచించారు..

ఒమిక్రాన్ టెస్టులు

ఒమిక్రాన్ టెస్టులు

అఖిలేష్ భార్య, కూతురుకు సోకింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్నది తేల్చేందుకు వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అటు అఖిలేష్ ఇంట్లోని అందరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అఖిలేష్ యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే ఆయన ఇంతవరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు.

ఐసోలేషన్‌లో అఖిలేష్ యాదవ్

ఐసోలేషన్‌లో అఖిలేష్ యాదవ్


మరోవైపు తన భార్య డింపుల్, కూతురు టీనాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో అఖిలేష్ యాదవ్ కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ నేత జ‌యంత్ చౌద‌రితో క‌లిసి రేపు అలీఘ‌ర్‌లో అఖిలేష్ యాద‌వ్ ప్ర‌చారం చేయాల్సి ఉంది. తన ఇంట్లో కరోనా కేసులు బయటపడడంతో ఈ ప్ర‌చార‌యాత్ర‌కు అఖిలేష్ హాజ‌ర‌డంపై సందేహాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+