వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదేశాలపై యాగి..! ఉదయం 9 గంటలకే ఆఫీసుకు రావాలంటే ఎలా అంటూ ఉద్యోగుల ప్రశ్న!!

|
Google Oneindia TeluguNews

యూపి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ అధికారులకు విధించిన నిబంధనలపై వ్యతిరేకత వ్వక్తం అవుతుంది..ఇటివల కలెక్టర్లతో పాటు పోలీసులు కూడ ఉదయం 9 గంటల కల్లా తమ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..దీంతో తోమ్మిది గంటల నిబంధనపై పోలీసు అధికారుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మిగతా ఉద్యోగుల్లాగా పోలీసులను కూడ ఉదయం తోమ్మిది గంటలకే ఆఫీసులకు రావాలనడంతో టార్చర్ అనుభవిస్తున్నట్టు ఓ జిల్లా ఎస్పి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..దీంతో ఎస్పిని ప్రభుత్వం అర్థంతరంగా బదీలీ చేసింది.

యోగి తీసుకువచ్చిన 9 గంటల నిబంధన కలకలం..

యోగి తీసుకువచ్చిన 9 గంటల నిబంధన కలకలం..

యూపిలో యోగి ఆధిత్యానాథ్ జిల్లా కలెక్టర్లతోపాటు ఎస్పీల పనివేళల్లో తీసుకువచ్చిన నిబంధన పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులు కూడ ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే ఈ నిబంధన తమను టార్చర్‌కు గురి చేస్తుందని కాస్‌గంజ్ ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు...ఉద్యోగులకు ఆ నిబంధన అమలు చేయడం సమంజమే అయినా...24 గంటల పాటు ఉద్యోగం చేసే పోలీసు అధికారులకు సైతం ఈ నిబంధన విధించడం సరైన పద్దతి కాదని తెలిపారు..

పోలీసులకు నిబంధన ఏంటని ఆవేదన...

పోలీసులకు నిబంధన ఏంటని ఆవేదన...

ఎదైన ప్రమాదం , సంఘటన జరిగినప్పడు పోలీసు అధికారులు అర్ధరాత్రి వరకు విధుల్లో ఉంటారని ..తాము ఇంటికి వెళ్లే సరికే అర్థరాత్రి దాటుతుందని అశోక్ కుమార్ చెప్పారు..ఇలాంటీ సంధర్భంలో తమని 9 గంటలకే కార్యాలయాలకు రావాలని పేర్కోవడం తో ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని ఆయన అఅన్నారు....అయితే జిల్లా స్థాయి ఎస్పి ఇలాంటీ వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఎస్పి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే ఆయన్ను మొరాదాబాద్‌లోని 9వ బెటాలియన్‌కు పంపించారు.

మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించింది..ఎస్పి

మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించింది..ఎస్పి

అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేదని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైన దాన్ని అమలు చేయాల్సిన భాద్యత ఉద్యోగులకు ఉంటుందని తెలిపిన ఎస్పి తమ ఇబ్బందులను తెలియ చేసేందుకే ఆ వ్యాఖ్యలు చేసినట్టు రాష్ట్ర డీజీపీకి వివరణ ఇచ్చినట్టు తెలిపారు.అయితే మీడీయా తన వ్యాఖ్యలను వక్రికరీంచిందని అన్నారు.కాగా ప్రభుత్వ నిబంధన పోలీసులకు సడలించాలని పలువులు పోలీసు అధికారులు కూడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

English summary
we have all grumbled about having to go to work early in the morning. But doing so got a police officer in Uttar Pradesh transferred.Kasganj SP Ashok Kumar had complained about a new order from UP CM Yogi Adityanath that asked public officials to come to office at 9 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X