అజాంఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందే... స్పీకర్ ఆదేశం
డిప్యూటి స్ఫికర్ రమాదేవిపై సమాజ్ వాది ఎంపీ అంజాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పికర్ ఓం బిర్లా ఆదేశించారు. దీనిపై రెండు రోజులుగా లోక్‌సభలో దుమారం రేగుతుండగా స్పీకర్ ఆల్‌పార్టీ సమావేశం ఏర్పాటు చేశాడు. అనంతరం పలువురి అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత స్పికర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.కాగా స్పికర్ నిర్ణయం తర్వాత సోమవారం జరిగే సమావేశాల్లో అజాంఖాన్ సభలో క్షమాపణాలు చేప్పే అవకాశాలు ఉన్నాయి.
ట్రిపుల్ తలాక్‌పై చర్చ సందర్భంగా గురువారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై ఎంపీ ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ సభ్యులందరూ ఖండించారు. ఇవాళ మహిళా ఎంపీలు, మంత్రులు మాట్లాడుతూ.. ఆజం ఖాన్ ప్రవర్తన సరిగా లేదని మండిపడ్డారు . దీంతో స్పీకర్ ఒంబిర్లా విపక్ష పార్టీల నేతలతో చర్చించారు. దీంతో పలువురి ఎంపీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సభలోనే ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలని అన్ని పార్టీలు తీర్మానించినట్లు స్పీకర్ తెలిపారు. ఒకవేళ ఆజం క్షమాపణలు చెప్పని పక్షంలో ఆ తర్వాత ఆయనపై చర్య తీసుకుంటామని స్పీకర్ బిర్లా చెప్పారు.

సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటి స్పికర్‌ను చూస్తూ మీ కళ్లలోకి కళ్లు పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నానని అన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ ఓం బిర్లా ఆజం ఖాన్‌ను మందలించి క్షమాపణ చెప్పాలని సూచించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం ఆయనను సమర్థిస్తూ పార్లమెంటులో బీజేపీ సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని ఆరోపించారు. క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని, అన్ పార్లమెంటరీ పదాలు వాడితే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications