Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Azam Khan surrender: కోర్టులో సరెండర్ అయిన ఎస్పీ ఎంపీ అజామ్ ఖాన్, భార్య, కుమారుడు కూడా..

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఎస్పీ నేత, ఎంపీ అజాంఖాన్ కుటుంబంతో సహా కోర్టులో లొంగిపోయాడు. వివిధ కేసుల్లో అభియోగాలపై కోర్టుకు హాజరుకాకపోవడంతో చివరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. తన భార్య తంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజామ్‌తో కలిసి రాంపూర్ జిల్లా కోర్టులో బుధవారం లొంగిపోవాల్సి వచ్చింది. వారికి మేజిస్ట్రేట్ ఏడురోజుల జ్యుడిషీయల్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు.

అజాంఖాన్, అతని కుమారుడిపై భూ కబ్జా, ఆక్రమణ, విద్యుత్ చోరీ, విగ్రహాల చోరీ, పుస్తకం, గేదె, మేక తదితర దొంగతనాల కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ కోసం రాంపూర్ కోర్టు పలుమార్లు హాజరుకావాలని పిలవగా.. రాలేదు. దీంతో అరెస్ట్ వారెంట్ జారీచేయడంతో వెంటనే కోర్టు ముందు ఫ్యామిలీతో సహా వాలిపోయారు. వారికి జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన తర్వాత తదుపరి విచారణను మార్చి 2వ తేదీని మేజిస్ట్రేట్ వాయిదా వేశారు.

SP leader Azam Khan surrenders with wife and son, sent to jail

అరెస్ట్ వారెంట్‌తోపాటు అజాంఖాన్ ఆస్తులను అటాచ్ చేసుకుంటామని రాంపూర్ కోర్టు మంగళవారం పేర్కొన్నది. తంజీమ్ ఫాతిమా, అబ్దుల్లా అజామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. వారిపై ఉన్న కేసుల విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఆయా కేసుల్లో అజాంఖాన్, అతని కుటుంబసభ్యులు కోర్టు నుంచి యాంటిసెపెటరీ బెయిల్ పొందడానికి ప్రయత్నించారు. కానీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

గతేడాది జూలై నుంచి అజాంఖాన్ ఇబ్బందులు మొదలయ్యాయి. అతను, భార్య, కుమారుడిపై 4 కేసులు నమోదవడం విశేషం. మరోవైపు అబ్దుల్లా అజామ్ పుట్టినతేదీ పత్రాలపై ఫోర్జరీ కేసు నమోదైంది. అతను ఫోర్జరీ చేసినట్టు రుజువు అవడంతో.. అతను శాసనసభ సభ్యత్వాన్నే కోల్పోయిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+