Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SP leader: అన్నా..... చింపేశావ్, బార్ గర్ల్స్ తో పొలిటికల్ లీడర్ రింగరింగ, కోవిడ్ ఎఫెక్ట్ (వీడియో) !

లక్నో/ ఉత్తరప్రదేశ్: కోవిడ్ నియమాలు గాలికి వదిలేసిన ఓ పార్టీ నాయకుడు ఆయన కుమార్తె పెళ్లి ఢామ్ డామ్ అంటూ చేశాడు. ఇదే పెళ్లిలో అందరిని ఉత్తేజపరచడానికి బార్ గర్ల్స్ తో రికార్డింగ్ డ్యాన్స్ లు, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెళ్లికి వెళ్లిన ఓ పొలిటికల్ లీడర్ స్టేజ్ మీద అర్దనగ్నంగా ఉన్న బార్ గర్ల్స్ అందం చూసి తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా ఎగిరి స్టేజ్ మీదకు జంప్ చేసిన ఆ పొలిటికల్ లీడర్స్ ప్రభుదేవ రైంజ్ లో రెచ్చిపోయి డ్యాన్స్ చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. స్టేజ్ మీద ఏమిటి ఈ రామయణం అంటూ స్థానికులు అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నించడంతో ఆ పొలిటిక్ లీడర్ మద్దతు దారులు వారిని కుర్చీలతో కొట్టి వాళ్ల ప్రతాపం చూపించారు. పొలిటికల్ లీడర్, బార్ గర్ల్స్ రికార్డింగ్ షో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పొలిటికల్ పోటుగాడితో పాటు పెళ్లి చేసిన పెద్దల మీద కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కూతురి పెళ్లి

కూతురి పెళ్లి

ఉత్దరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ సమీపంలోని కాంపియర్ గంజ్ లోని బైజ్ నాథ్ పూర్ లో సమాజ్ వాద్ పార్టీ నేత బాల్ కిషన్ యాదవ్ నివాసం ఉంటున్నాడు. సమాజ్ వాది పార్టీలో బాల్ కిషన్ యాదవ్ కు మంచి లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని నెలల క్రితమే పోలిటికల్ లీడర్ బాల్ కిషన్ యాదవ్ కుమార్తె పెళ్లి నిశ్చయం అయ్యింది.

కోవిడ్ నియమాలతో పెళ్లి చెయ్యాలి

కోవిడ్ నియమాలతో పెళ్లి చెయ్యాలి

కరోనా వైస్ దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చెయ్యాలని బాల్ కిషన్ యాదవ్ డిసైడ్ అయ్యారు. కోవిడ్ నియమాలు పాటించి పెళ్లి చెయ్యాలని అధికారులు బాల్ కిషన్ యాదవ్ కు సూచించారు. జూన్ 2వ తేదీ బాల్ కిషన్ యాదవ్ కుమార్తె వివాహం బైజ్ నాథ్ పూర్ లో జరిగింది.

 ఫైర్ బ్రాండ్ లీడర్

ఫైర్ బ్రాండ్ లీడర్

బాల్ కిషన్ యాదవ్ కోవిడ్ నియమాలు పక్కన పెట్టేసి కూతురి పెళ్లికి బార్ గర్ల్స్ తో స్టేజ్ షోలు, రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేశాడు. పెళ్లికి ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీ నేతలు చాలా మంది హాజరైనారు. ఇదే పెళ్లికి సమాజ్ వాది పార్టీ నేత, ఆ పార్టీలో వివాదాస్పద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శైలేంద్ర యాదవ్ కూడా హాజరైనాడు.

అన్నా..... చంపేశావు.... నీ ముందు ప్రభుదేవా వేస్ట్

అన్నా..... చంపేశావు.... నీ ముందు ప్రభుదేవా వేస్ట్

పెళ్లి మండపం సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజ్ మీద బార్ గర్ల్స్ చేస్తున్న డ్యాన్స్ చూసిన శైలేంద్ర యాదవ్ తట్టుకోలేకపోయాడు. మంచి ఊపుఉన్న సమజ్ వాది పార్టీకి చెందిన పాట రావడంతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూకేశాడు. బార్ గర్ల్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసే అమ్మాయిలు చిన్నచిన్న స్టేప్పులు వేస్తుంటే మనోడు శైలేంద్ర యాదవ్ ప్రభుదేవా స్టైల్లో స్టెప్పులు వెయ్యాలని ప్రయత్నించాడు. శైలేంద్ర యాదవ్ వేస్తున్న తిక్కతిక్క స్టెప్పులు చూసిన ఆయన మద్దతుదారులు అన్నా నువ్వు చింపేశావు అంటూ ఇంకా రెచ్చగొట్టారు.

మందు కిక్కులో కుర్చీలతో దాడి

శైలేంద్ర యాదవ్ రెచ్చిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. అన్నా కోవిడ్ నియమాలు పాటించేదని పోలీసు అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతారని, మీరు స్టేజ్ దిగితే మిగిలినవాళ్లు సైలెంట్ గా ఉంటారని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఆసయంలో శైలేంద్ర యాదవ్ మద్దతుదారులు మద్యం కిక్కులో గ్రామస్తులను అక్కడ ఉన్న కర్చీలతో కొట్టారు. ఆ సమయంలో ఇరు వర్గాల మద్య గొడవ జరిగింది.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్


శైలేంద్ర యాదవ్ స్టేజ్ మీద అమ్మాయిలో రెచ్చిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న గోరఖ్ పూర్ ఎస్పీ దినేష్ యాదవ్ సమాజ్ వాది పార్టీ నేత శైలేంద్ర యాదవ్ తో పాటు పెళ్లి కూతురు తండ్రి బాల్ కిషన్ యాదవ్ మీద కేసులు నమోదు చేశారు. కోవిడ్ నియమాలు గాలికి వదిలేసి అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ సమాజ్ వాది పార్టీ నేతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని గోరఖ్ పూర్ జిల్లా ఎస్పీ దినేష్ యాదవ్ స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+