ఆ ఎమెల్యే బాడీగార్డ్ ఖాతాలో రూ.100 కోట్లు జమ

తన ఖాతాలో దాదాపు వంద కోట్ల రూపాయలు జమ అయిన విషయాన్ని గమనించి ఎస్పీ ఎమ్మెల్యే బాడీ గార్డ్ ఒకతను షాక్ తిన్నాడు. అవి ఎలా వచ్చాయనేది అతనికి అంతుపట్టలేదు.

కాన్పూర్: తన బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ. 100 కోట్లు జమ అయినట్లు తెలుసుకుని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఓ శాసనసభ్యుడి బాడీగార్డ్ షాక్ తిన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి బాడీ గార్డు గులాం జిలానీ ఎస్బీ ఖాతాలో అతనికి తెలియకుండా ఆ మొత్తం డిపాజిట్ అయింది.

గత రాత్రి అతను డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎటిఎంకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఖాతాలో రూ.99,99,02,724 డిపాజిట్ అయిన విషయాన్ని గమనించాడు. కాన్పూర్‌లోని మాల్ రోడ్డులో గల స్టేట్ బ్యాంక్ ఇండియా శాఖలో అతనికి ఖాతా ఉంది. తన ఖాతాలో అంత మొత్తం జమ అయిన విషయాన్ని అతను ఎమ్మెల్యే సోలంకికి చెప్పాడు.

SP MLA bodyguard's account credited with almost Rs 100 cr

దాంతో సోలంకి ఆ విషయంపై కాన్పూర్ జిల్లా కలెక్టర్ కుషాల్ రాజ్ శర్మకు తెలియజేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ విషయంపై తాను ఎస్బీఐ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ను అడిగానని, జిలానీ ఓ దరఖాస్తు ఇవ్వాలని చెప్పారని కుషాల్ చెప్పారు.

ఈ సంఘటనతో జిలానీ బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. ఆ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు. కుషీనగర్ జిల్లాకు చెందిన పాడ్రౌనా ప్రాంతానికి చెందిన జిలాన కాన్పూర్‌లోని జాజ్మౌ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+