వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ అజాంఖాన్ పై మరో దొంగతనం కేసు...! దాడి చేసి గేదెలను ,25000 ఎత్తుకెళ్లాడు...!

|
Google Oneindia TeluguNews

యూపీకి చెందిన సమాజ్‌వాది ఎంపీ అజాంఖాన్ ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. స్థానికంగా ఆయనపై పలుకేసులు కూడ నమోదయ్యాయి. ఇలా ఇప్పటికే ఇలా 50 కేసుల వరకు ఆయనపై నమోదయ్యాయంటే అతియోశక్తికాదు. ఇక ఇటివల సాక్ష్యాత్తు లోక్‌సభ డిప్యూటి స్పికర్‌పై కూడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పే వరకు విషయం వెళ్లింది. కొద్ది రోజుల క్రితం లైబ్రరీలో పుస్తకాలు దొంగిలించాడని కేసు నమోదు కాగా, తాజాగా ఆయనపై మరో దొంగతనం కేసు నమోదయింది. తన ఇంట్లో చొరబడి 25000 వేల రుపాయాలతో పాటు పాలిచ్చే గేదేలను దొంగిలించాడని క్రిమినల్ కేసు నమోదైంది.

రాంపూర్ ఎంపీపై మరో దొంగతనం కేసు

రాంపూర్ ఎంపీపై మరో దొంగతనం కేసు

ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే అవుతున్నాయి. తాజాగా అజాంఖాన్ మరో కేసులో ఇరుక్కున్నాడు. రాంపూర్‌లో అజాంఖాన్ తోపాటు మరో అయిదుగురు ఆయన అనుచరులు తమ ఇంటి మీదకు వచ్చి దాడి చేశారని, ఈనేపథ్యంలోనే రూ.25000 నగదుతోపాటు ఇంటిబయట ఉన్న గేదేలను కూడ పట్టుకుని పోయారని ఓ కుటుంభం ఆయనపై కేసును నమోదు చేసింది.

ఇంటి స్థలంలో స్కూలు,

ఇంటి స్థలంలో స్కూలు,

వివారాల్లోకి వెళితే రాంపూర్‌లోని ఆసిఫ్ మరియు జకీర్ ఆలీ ల కుటుంభం అద్దె ఇంట్లో గత కొన్నాళ్లుగా నివసిస్తోంది. ఇంటికి రెంట్ కడుతూ చట్టపరంగా నివసిస్తున్నారు. అయితే అక్కడి స్థలంలో ప్రభుత్వం స్కూల్ నిర్మించేందుకు నిర్ణయించింది. దీంతో ఆసీఫ్ కుటుంభం ఆ ఇల్లును ఖాలీ చేసేందుకు నిరాకరించడంతో అజాంఖాన్ అనుచరులు దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఎంపీ ఆజాం ఖాన్‌తో పాటు ఆయన అనుచరులు పేర్లు కూడ చేర్చారు.

అజాంఖాన్ పై ఇప్పటికే 50 కేసులు నమోదు...

అజాంఖాన్ పై ఇప్పటికే 50 కేసులు నమోదు...

అజాంఖాన్ పై ఇప్పటికే పలు రకాల కేసులు నమోదయ్యాయి. వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. నమోదైన భూకబ్జాల్లోని 29 కేసుల్లో ముందస్తు బెయిల్ కూడ కోర్టు నిరాకకించిన పరిస్థితి. ఇాలా ఇప్పటివరకు ఆజాంఖాన్‌పై దాదాపు 50 భూకబ్జా కేసులు, వివాదాస్పద వ్యాఖ్యల కేసులు, పుస్తకాల చోరీ కేసులు, వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి.కాగా ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటి చేసిన బీజేపీ అభ్యర్థి నటి జయప్రదపై కూడ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ కూడ కేసులు నమోదు చేసింది.

English summary
Samajwadi Party (SP) MP Azam Khan has been booked for stealing a buffalo and Rs 25,000 from a family in Rampur, Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X