బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Spa: ఐటీ హబ్ లో స్పా సెంటర్ లేడీ ఓనర్ తో ?, ఖాకీలు, రిపోర్టర్ అరెస్టు, బ్లాక్ మెయిల్ చేసి లక్షలు లూటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో స్పా అండ్ సెలూన్ లకు ఏమాత్రం కొదవలేదు. ఇటీవల కాలంలో స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని వెలుగు చూడటంతో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు. స్పా ముసుగులో విదేశీ యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని వెలుగు చూసింది. స్పా అండ్ సెలూన్ ల మీద బెంగళూరు పోలీసులు నిఘా వేశారు. ఐటీ హబ్ లో ఓ మహిళ విలాసవంతమైన స్పా అండ్ సెలూన్ కేంద్రం నిర్వహిస్తున్నది. కొందరు ఖాకీ దుస్తులు వేసుకుని ఆ స్పా సెంటర్ లో ఎంట్రీ ఇచ్చారు. పనిలో పనిగా వారి ఐడీ కార్డులు ఆమెకు చూపించారు. నువ్వు స్పా ముసుగులో ఇక్కడ అమ్మయిలు, మహిళలతో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నావని, నిన్ను అరెస్టు చేసి జైల్లో పెడుతామని, నీకు చిప్పకూడా గ్యారెంటీ అని బెదిరించారు. ఖాకీ దుస్తుల్లో వెళ్లిన వ్యక్తుల వెంట ఓ పత్రిక విలేకరి కూడా ఉన్నాడు. ఖాకీలు, మీడియా వ్యక్తి ఒకే సారి వెళ్లడంతో స్పా యజమానురాలు బిత్తరపోయింది. ఖాకీల దెబ్బతో హడలిపోయిన మహిళ 60 వేల రూపాయలు క్యాష్ వాళ్ల చేతిలో పెట్టింది, అయినా నిందితులు ఆమెను వదల్లేదు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మరో లక్ష రుపాయాలు నిందితుల అకౌంట్ కు పంపించింది. అయినా నిందితులు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. విసిగిపోయిన స్పా యజమాని తెగించడంతో అసలు కథ మొదలైయ్యింది.

Revenge: వివాహిత మహిళతో ?, కసితో ఫేస్ బుక్ లో లేడీ ఫోటోలు, ఫోన్ నెంబర్, దెబ్బకు డార్లింగ్ ఢమల్ !Revenge: వివాహిత మహిళతో ?, కసితో ఫేస్ బుక్ లో లేడీ ఫోటోలు, ఫోన్ నెంబర్, దెబ్బకు డార్లింగ్ ఢమల్ !

స్పా అండ్ సెలూన్ యజమాని

స్పా అండ్ సెలూన్ యజమాని

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయంతి నగర్ మెయిన్ రోడ్డులో ఆలయ్యా సెలూన్ అండ్ స్పా సెంటర్ ఉంది. ప్రభా అనే మహిళ ఆలయ్యా సెలూన్ అండ్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నది. రామమూర్తి నగర్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని కొందరు ప్రభా స్పా సెంటర్ కు వెళ్లి వస్తున్నారు.

హోమ్ గార్డుల కన్నుపడింది

హోమ్ గార్డుల కన్నుపడింది


కేజీ హళ్ళి పోలీసు డివిజన్ ఏసీపీ కార్యాలయంలో సంపంగిరామ్, హెణ్ణూరు పోలీస్ స్టేషన్ లో ఆసీఫ్ ఆనంద్ రాజ్, వినాయక్ అనే వ్యక్తులు హోమ్ గార్డులుగా పని చేస్తున్నారు. హోమ్ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్న సంపంగిరామ్, ఆసీఫ్, ఆనంద్ రాజ్, వినాయక్ కుపరిచయం ఉంది, నలుగురు హోమ్ గార్డులు ప్రభా స్పా సెంటర్ మీద కన్ను వేశారు.

ప్రభాను బెదిరించారు

ప్రభాను బెదిరించారు


ప్రభా విలాసవంతమైన స్పా అండ్ సెలూన్ కేంద్రం నిర్వహిస్తున్నది. ఈ నలుగురు హోమ్ గార్డులు ఖాకీ దుస్తులు వేసుకుని ప్రభా నిర్వహిస్తున్న స్పా సెంటర్ లో ఎంట్రీ ఇచ్చారు. పనిలో పనిగా వారి ఐడీ కార్డులు ప్రభాకు చూపించారు. మీ స్పా సెంటర్ లో విచారణ చెయ్యాలని మాకు పై అధికారులు సూచించారని నలుగురు ప్రభాకు చెప్పారు. నువ్వు స్పా ముసుగులో ఇక్కడ అమ్మయిలు, మహిళలతో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నావని, నిన్ను అరెస్టు చేసి జైల్లో పెడుతామని, నీకు చిప్పకూడా గ్యారెంటీ అని స్సా సెంటర్ యజమాని ప్రభాను బెదిరించారు.

 రూ. 1. 60 లక్షలు స్వాహా

రూ. 1. 60 లక్షలు స్వాహా

ఖాకీ దుస్తుల్లో వెళ్లిన నలుగురు హోమ్ గార్డుల వెంట కస్టమ్స్ అండ్ ఎక్సైస్ పత్రిక విలేకరి ఖలీం కూడా ఉన్నాడు. నలుగురు హోమ్ గార్డులు, మీడియాకు చెందిన ఖలీం ఒకే సారి వెళ్లడంతో స్పా యజమానురాలు ప్రభా బిత్తరపోయింది. ఖాకీల దెబ్బతో హడలిపోయిన ప్రభా 60 వేల రూపాయలు క్యాష్ వాళ్ల చేతిలో పెట్టింది, అయినా నిందితులు ప్రభాను వదల్లేదు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మరో లక్ష రుపాయాలు నిందితుల అకౌంట్ కు పంపించింది.

పక్కాప్లాన్ తో అరెస్టు

పక్కాప్లాన్ తో అరెస్టు


అయినా నిందితులు ఐదు మంది మరో రూ. 30 వేలు ఇవ్వాలని ప్రభాను బ్లాక్ మెయిల్ చేశారు. విసిగిపోయిన ప్రభా రామమూర్తి నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇస్తాము రావాలని ప్రభాతో ఫోన్ చేపించిన రామమూర్తి నగర పోలీసులు నలుగురు హోమ్ గార్డులతో పాటు ఖలీం అనే రిపోర్టర్ ను అరెస్టు చేశారు.

ఐటీ హబ్ లో స్పా సెంటర్ల మీద నిఘా

ఐటీ హబ్ లో స్పా సెంటర్ల మీద నిఘా

ఐటీ హబ్ బెంగళూరులో స్పా అండ్ సెలూన్ లకు ఏమాత్రం కొదవలేదు. ఇటీవల కాలంలో స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని వెలుగు చూడటంతో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు. స్పా ముసుగులో విదేశీ యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని వెలుగు చూసింది. స్పా అండ్ సెలూన్ ల మీద బెంగళూరు పోలీసులు నిఘా వేశారు.

English summary
Spa: Home guards and reporter arrested for blackmail case in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X