భర్త తీర్చలేని కోరికలను తీరుస్తున్న స్పా సెంటర్ (వీడియో)
సాధారణంగా భార్యాభర్తలు ఒకరికొకరు శ్రద్ధ, ప్రేమ, రొమాన్స్ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు భాగస్వామి నుండి ఆ అటెన్షన్ లభించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం సింగపూర్‌లోని ఒక స్పా ప్రత్యేక సేవలను అందిస్తోంది. భర్త దగ్గర పొందలేని సుఖాన్ని అందించడమే లక్ష్యంగా, శ్రద్ధతో కూడిన రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది.
ఈ స్పా లగ్జరీ ట్రీట్‌మెంట్స్‌తో పాటు, ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ, మహిళలకు వారి జీవితంలో ఎప్పుడూ చూడని రొమాంటిక్ అనుభవాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమ భాగస్వామి నుండి తగినంత శ్రద్ధ లభించని మహిళలు ఈ స్పాను సందర్శిస్తే, వారికి రెగ్యులర్ స్పా ట్రీట్‌మెంట్స్‌తో పాటు, అక్కడ ఉండే పురుష అటెండెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరు కస్టమర్లతో కూర్చుంటారు, బుజ్జగిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడుతూ తోడుగా ఉంటారు. తినిపిస్తారు, కాళ్ళు నొక్కడం, సున్నితంగా ముట్టుకోవడం వంటివి చేస్తూ, వారికి నచ్చిన విధంగా రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు. అంటే, ఇది లైంగిక సంబంధం కాకుండా, రొమాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలకు ఈ స్పా ఒక మంచి ఎంపిక అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అటెన్షన్ పొందేందుకు ఇదొక చక్కటి ప్రదేశమని వారు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications