Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం: ప్రత్యేక జడ్జీ బదిలీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీస్ హాజరీ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఆమే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులను విచారించనున్నారు.

కాగా, ఢిల్లీ హైకోర్టులో జ్యూడీషియల్ సర్వీసెస్‌లోని మరో 26 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవితకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జీ నాగ్ పాల్ ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.

Special Judge Nagpal hearing Delhi excise policy case transferred

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత రూ. 100 కోట్లు చెల్లించారని ఈడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, తీహార్ జైల్లో కలుద్దామంటూ ఈ కేసు, మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. సినిమా క్లైమాక్స్ చేరుకుందని, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని ఆ లేఖలో సుఖేష్ పేర్కొన్నారు.

మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు.

తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు.

పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో వివరించారు. కాగా, కవిత ఈడీ కస్టోడియల్ విచారణ మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+