సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అమృత కాల సమయంలో కొన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.

ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోన్న ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సరికొత్త ట్రెండ్‌కు నాంది పలకబోతోన్నాయి. ఈ సమావేశాల విధులకు హాజరయ్యే పార్లమెంట్ ఉద్యోగులు, భద్రత సిబ్బంది, సిబ్బందికి ఎప్పుడూ లేని విధంగా డ్రెస్ కోడ్‌ను అమలులోకి తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. డ్రెస్ కోడ్ ఎలా ఉండాలనేదీ వెల్లడించింది.
లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ వర్తింపజేసింది. పాత డ్రెస్‌ల స్థానంలో 'ఇండియన్ టచ్' ఉండే సరికొత్త సంప్రదాయబద్ధమైన వస్త్ర ధారణకు శ్రీకారం చుట్టింది. రౌండ్ నెక్ షర్టులు, ఖాకీ రంగు ప్యాంటును ధరించాల్సి ఉంటుంది. మణిపురి సంప్రదాయాన్ని ప్రతిబింబించే టోపీలను ధరించాల్సి ఉంటుంది. రౌండ్ నెక్ షర్ట్స్ మీద సిబ్బంది స్లీవ్‌లెస్ జాకెట్లు కూడా ధరించే వెసలుబాటును కల్పించింది.

మార్షల్స్ ఇప్పుడు సఫారీ సూట్‌లకు బదులుగా క్రీమ్-కలర్ కుర్తా, పైజామా ధరించాల్సి ఉంటుంది. అమృత్ కాల్ సమావేశాల సందర్భంగా కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ కోసం కొత్త డ్రెస్ కోడ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులందరూ చీరలు ధరిస్తారు.
ఈ నెల 18వ తేదీన జరగనున్న పార్లమెంట్ సమావేశాలు పాత భవనంలో ప్రారంభమౌతాయి. ఆ మరుసటి రోజున కొత్త బిల్డింగ్‌కు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వినాయక చవితి పండగనను పురస్కరించుకుని కొత్త పార్లమెంట్‌లో సమావేశాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications